సిద్ధార్థలో మీనాక్షిచౌదరి సందడి | - | Sakshi
Sakshi News home page

సిద్ధార్థలో మీనాక్షిచౌదరి సందడి

Feb 7 2026 3:06 PM | Updated on Feb 7 2026 3:06 PM

సిద్ధార్థలో మీనాక్షిచౌదరి సందడి

సిద్ధార్థలో మీనాక్షిచౌదరి సందడి

నారాయణవనం: సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలలో శుక్రవారం రాత్రి సినీ నటి మీనాక్షి చౌదరి విద్యార్థులతో కలిసి సందడి చేశారు. కళాశాల సిల్వర్‌ జూబిలీ వేడుకల్లో భాగంగా శుక్రవారం స్పోర్డ్స్‌డే నిర్వహించారు. ముఖ్య అతిథులుగా అనంతపురం జేఎన్‌టీయూ రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కృష్ణయ్య, సినీ నటి మీనాక్షిచౌదరి హాజరయ్యారు. విద్యార్థులు, బోధన, బోధనేతర సిబ్బందికి ఆటల పోటీలు నిర్వహించారు. సాయంత్రం ఓపెన్‌ ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో క్రీడల్లో గెలుపొందిన వారికి కృష్ణయ్య, మీనాక్షిచౌదరి ప్రశంసా పత్రాలను, జ్ఞాపికలను, ట్రోపీలు అందజేశారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులకు శారీరకంగానూ, మానసికంగానూ ధృఢంగా ఉంటేనే చదువుపై దృష్టిని సారించే అవకాశం ఉంటుందన్నారు. సినీ నటి మీనాక్షి చౌదరి మాట్లాడుతూ బ్యాడ్మింటన్‌, స్విమ్మింగ్‌లో క్రీడాకారిణిగా గుర్తింపు తెచ్చుకున్నానన్నారు. దేహ ధారుడ్యానికి క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. కళాశాలల చైర్మన్‌ డాక్టర్‌ అశోకరాజు మాట్లాడుతూ శనివారం పూర్వ విద్యార్థుల అలుమిని డే, ఆదివారం నిర్వహించే సిల్వర్‌ జూబ్లీ వేడుకల్లో సినీ హీరోయిన్స్‌ నిధి అగర్వాల్‌, శ్రీలీల, హీరో తేజా సజ్జా, తమన్‌ సంగీత విభావరి, నటరాజ్‌ ట్రూప్‌ నృత్య ప్రదర్శన ఉంటుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement