వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరంభం
ఆసక్తి చూపని గ్రామ సర్వేయర్లు
రోవర్లు చెడిపోయినా పట్టించుకోరు
90మంది సర్వేయర్ల కొరత
తప్పులతడకగా రీసర్వే
జిల్లా సమాచారం
సర్వే చేయాల్సిన గ్రామాలు 1080
సర్వే చేయాల్సిన ఎకరాలు 15,90,351 ఎకరాలు
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో...
మూడు విడతల్లో సర్వే పూర్తి చేసిన గ్రామాలు 320
మూడు విడతల్లో
సర్వే చేసిన ఎకరాలు 2,30,138 ఎకరాలు
చంద్రబాబు ప్రభుత్వంలో...
చంద్రబాబు ప్రభుత్వంలో మూ విడతల్లో
సర్వే చేసిన గ్రామాలు 113
సర్వే చేసిన ఎకరాలు 83,642 ఎకరాలు
తిరుపతి జిల్లాలో భూ సర్వే
తిరుపతి అర్బన్:భూముల రీ–సర్వే ప్రక్రియకు చంద్ర బాబు పాలనలో అడుగడుగునా అవాంతరాలు ఎదురవుతున్నాయి. సర్వేకు తగ్గట్లుగా సర్కారు సహకారం లేకపోవడంతో నత్తనడకన సాగుతుంది. ప్రధానంగా సర్వేకు కీలకమైన రోవర్లు కొరత, లాప్‌టాప్‌లు చాలీ చాలకుండా ఉండడం, సరిపడా స్టేషనరీ సమకూర్చకపోవడంతో సర్వే పనులు ముందుకు సాగడం లేదు. మరోవైపు గ్రామ సచివాలయాల పరిధిలో 497 మంది సర్వేయర్లు ఉండాల్సి ఉంది. అయితే 90 మందిని కూటమి ప్రభుత్వం డిప్యూటేషన్ పద్ధతిలో ఇతర విభాగాలకు పంపడంతో సర్వేయర్ల కొరత వేధిస్తోంది.
బాబు హయాంలో నామమాత్రం
2024 జూన్ 12 చంద్రబాబు సర్కార్ కొలువుదీరినప్పటికి గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన 2.50లక్షల సరిహద్దురాళ్లు తొలగింపు చేయడానికి 2024 డిసెంబర్ వరకు సమయం తీసుకున్నారు. ఆ తర్వాత 2025 జనవరి 20 నుంచి రీ సర్వేకు శ్రీకారం చుట్టారు. మొదటి విడతలో 33 గ్రామాలను ఫైలెట్ ప్రాజెక్టు పేరుతో 19,907 ఎకరాలు, రెండో విడతలో 54 గ్రామాల్లో 36,947 ఎకరాలు, మూడు విడతల్లో 26 గ్రామాల్లో 26,788 ఎకరాల్లో మాత్రమే పూర్తి చేశారు.
అవకతవకలు.. ఆరోపణలు
భాకరాపేట: తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మండలం భాకరాపేట రెవెన్యూ గ్రామంలో భూసర్వే వెలుగులోకి వస్తున్న రికార్డుల అవకతవకలు తీవ్రమైన అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రభుత్వ భూములు, చెరువులు, గ్రామకంఠం భూములకే పట్టాలు సృష్టించారనే విమర్శలున్నాయి. ప్రత్యేకంగా సర్వే నంబర్లు 576, 235, 233, 498, 635కు సంబంధించిన రికార్డుల్లో విస్తీర్ణ మార్పులు, సరిహద్దుల గందరగోళం, మ్యాపింగ్ అవకతవకలు ఉన్నాయి. రీ–సర్వే అనంతరం భూముల విస్తీర్ణం పెరిగిన కేసులు, ఎల్‌పీఎం ఎంట్రీల్లో గందరగోళం, బ్లాక్ సర్వే నంబర్ల పునర్విభజనలో అసమానతలు, కొన్ని భూములు భౌగోళికంగా ఒకచోట ఉండగా, రికార్డుల్లో వేరే సర్వే నంబర్లకు అనుసంధానం కావడం గమనార్హం.
సర్వేకు సర్కారు సహకారం నామమాత్రం
సంకల్పయాత్ర సందర్భంగా భూ సమస్యలపై ఊరూరా వేలాది మంది పేద ప్రజలు జగనన్నకు చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో భూ సర్వేకు శ్రీకారం చుట్టారు. బ్రిటీష్ పాలకుల భూ సర్వే తర్వాత వందేళ్లకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో భూముల రీ సర్వేకు సంకల్పించారు. మూడు విడతల్లో 320 గ్రామాల్లో 2,30,138 ఎకరాల్లో సర్వే పూర్తి చేసి భూహక్కు పత్రాలను రైతులకు అందించారు. అలాగే మరో 200 గ్రామాల్లో గ్రౌండ్‌లెవల్‌లో సర్వేకు 1.50లక్షల ఎకరాలను సర్వేకు సిద్ధం చేశారు.
లోటుపాట్లు సవరించుకుంటాం..
సర్వేలో లోటుపాట్లు సవరించుకుంటూ ముందుకు సాగుతాం. రోవర్ల సమస్యలకు పరిష్కారం చూపుతాం. ప్రస్తుతం గ్రామ సర్వేయర్లు సైతం సర్వేలో పాల్గొంటున్నారు. అవసరమైన మేరకు రోవర్లు, ల్యాప్‌టాప్‌లు, స్టేషనరీ సిద్ధం చేసుకుంటున్నాం. తప్పులు లేకుండా సర్వే చేయడానికి స్పష్టమైన ఆదేశాలిచ్చాం. 90 మంది సర్వేయర్ల కొరత ఉంది. ఆ లోటును భర్తీ చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మరో నాలుగు విడతల్లో వందశాతం సర్వేను పూర్తి చేస్తాం.
– అరుణ్‌కుమార్, అడిషనల్ డైరెక్టర్,
సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్
గుట్టు చప్పుడు కాకుండా రీసర్వే
కలువాయి(సైదాపురం): భూ ఆక్రమణదారులు కూటమి నేతల సిఫార్సులతో రికార్డులు పరిశీలించకుండానే ఫీల్డ్ మీదకి వెళ్లినట్లు అక్కడ ఫొటోలు దిగి తమ పనిని సులభంగా ముగిస్తున్నారు. 659, 660, 661, 662, 664, 666 తదితర సర్వే నంబర్లు ప్రభుత్వ భూములతో పాటు అసైన్‌మెంట్ భూములుగా ప్రభుత్వ రికార్డులో ఉన్నాయి. 659–2లో డి–పట్టా, ప్రభుత్వ భూమిని ఒక వ్యక్తి రూ.9 లక్షలకు అమ్మినట్లు సమాచారం. 660, 661, 662లో కుల్లూరు గ్రామానికి చెంది ఎస్సీలకు ఆరో విడత భూ పంపిణీ చేశారు. అదే గ్రామానికి చెందిన ఓ నేత పేదల నుంచి పట్టాలను తీసుకుని రూ. 20 వేల నుంచి 30 వేలు ఎస్సీ రైతులకు ముట్టజెప్పి పాసుపుస్తకాలు ఆ నేత వద్దనే పెట్టుకున్నారు. ఇటీవలనే ఆ భూముల్లో గ్రావెల్ తవ్వకాలు సాగించి ఆ నేత సొమ్ము చేసుకున్నారు.
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరంభం
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరంభం
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరంభం
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరంభం
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరంభం
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరంభం
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరంభం
వైఎస్‌ఆర్ సీపీ ప్రభుత్వంలో ఆరంభం


