రెండిళ్లలో చోరీ
నాయుడుపేట టౌన్: పట్టణంలోని రాజగోపాలపురం ఆరో వీధిలో ఉన్న రెండు ఇళ్లలో సుమారు రూ.4 లక్షలకు పైగా నగదు, 10 సవర్ల బంగారు ఆభరణాలు, 2 కిలోల వెండి అభరణాలు చోరీకి గురైనట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు.. రాజగోపాలపురంలో నివాసం ఉంటున్న గుండుబోయిన నరేష్ ఇంటికి తాళం వేసి, పెళ్లకూరు మండలం బంగారంపేటకు కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లాడు. అలాగే అదే ఇంటి మిద్దైపె నివాసం ఉంటున్న కారిపాక చిట్టిబాబు కూడా తమ కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్లారు. రెండు ఇళ్లకు తాళం వేసి ఉండటాన్ని గుర్తించిన దుండగులు తలుపులు తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడి బీరువాలో దాచి ఉంచిన బంగారు నగలు, నగదు, వెండి వస్తువులను అపహరించుకుని వెళ్లారు. నరేష్ గురువారం ఇంటి వద్దకు వచ్చి చూసే సరికి తలుపులు పగులగొట్టి ఉండటాన్ని గుర్తించాడు. ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు పగులగొట్టి అందులో దాచి ఉంచిన రూ. 2లక్షలకు పైగా నగదు, 4.50 సవర్ల బంగారు ఆభరణాలు, వెండి పట్టీలు దోచుకువెళ్లినట్లు గుర్తించారు. చిట్టిబాబు కూడా గురువారం సాయంత్రం ఇంటి వద్దకు చేరుకుని, పరిశీలించగా బీరువాలో దాచి ఉన్న 5 సవర్ల బంగారు నగలు, రూ. 2 లక్షల నగదు, 1.50 కిలోలకు పైగా వెండి వస్తువలు అపహరించుకు వెళ్లినట్లు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
లాటరీ పద్ధతిలో 4 బార్లు
తిరుపతి క్రైమ్: జిల్లాలో మిగిలి ఉన్న నాలుగు బార్లకు కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ వెంకటేశ్వర్, ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారి నాగమల్లేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో కేటాయించారు. శ్రీకాళహస్తి బార్‌కు–4, సూళ్లూరుపేట బార్‌కు–10, గూడూరులోని రెండు బార్లకు–8 దరఖాస్తులు వచ్చా యి. దరఖాస్తుల ద్వారా రూ.1.10 కోట్లు, ప్రాసెసింగ్ ద్వారా రూ.1.12 కోట్లు, మొదటి కంతు ద్వారా రూ.36.25లక్షలు, మొత్తంగా రూ.1.57 కోట్లు ప్రభుత్వ ఖజానాకు చేరింది. 2028 ఆగస్టు 31 వరకు వీరికి బార్ ను నిర్వహించుకోవడానికి అనుమతులు ఇచ్చారు.


