యూఎఫ్‌ఎస్ సర్వే తప్పులు లేకుండా చేయండి
తిరుపతి అర్బన్: తప్పులు లేకుండా యూఎఫ్‌ఎస్(యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే) చేపట్టాలని జాయింట్ కలెక్టర్ గోవిందరావు వెల్లడించారు. మంగళవారం ఆయన కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ యూఎఫ్‌ఎస్ సర్వేలు ఇచ్చిన అన్ని అంశాలను స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. అలాగే పీ3 అభివృద్ధి కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని చెప్పారు. మరోవైపు పీజీఆర్‌ఎస్‌కు వచ్చే ప్రతి అర్జీకి పరిష్కారం చూపించేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డీడీఓ నారాయణరెడ్డి, డీఎస్‌డబ్ల్యూఎస్ కోఆర్డినేటర్ జగదీష్, సీపీఓ వెంకటేశ్వర్లు, డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


