పరశురామేశ్వరునికి మహత్కార్యం
●
ఏర్పేడు: గుడిమల్లం పరశురామేశ్వరాలయం.. దేశంలోనే తొలి శైవక్షేత్రం. క్రీ.పూ.2వ శతాబ్ద కాలంలో ఈ ఆలయం నిర్మితమైనట్లు చారిత్రక ఆధారాలున్నాయి. ఈ ఆలయంలో స్వయంభువుగా వెలసిన పరశురామేశ్వరుని విగ్రహం శోభాయమానం. ఈ ఆలయ మహా కుంబాభిషేక మహోత్సవం గతంలో ఎప్పుడు నిర్వహించారో తెలిపేందుకు ఎలాంటి ఆధారాలు లేవు. అయితే అలాంటి మహత్తర ఘట్టానికి శివాజ్ఞ లభించింది. ఏప్రిల్ 19 నుంచి 23వ తేదీ వరకు ఐదు రోజులపాటు పరశురామేశ్వరుని మహాకుంభాభిషేక మహోత్సవం నిర్వహించనున్నారు. ఆలయ జీర్ణోద్ధరణ పనులు కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షణలో సాగుతున్నాయి.
ఇదీ చరిత్ర
పరశురామేశ్వర స్వామివారి విగ్రహం స్వయంభువుగా వెలసి 5 అడుగుల పురుషలింగాకృతిలో కనిపిస్తుంది. విగ్రహంలో త్రిమూర్తులు కొలువై ఉన్నారు. కింద రాక్షసావతారంలో బ్రహ్మ, మధ్యలో పరశురాముడు, పైన మానవ పురుషలింగాకృతిలో ఈశ్వరుడితో విగ్రహం ఉంది. నవపాషాణ శివలింగం(9 రకాల విష పదార్థాలతో కూడిన లింగం) దేశంలో మరెక్కడా లేదు. గుడిమల్లం పరశురామేశ్వరుని ఆలయ నిర్వహణ ఎన్నో ఏళ్లుగా కేంద్ర పురావస్తుశాఖ పర్యవేక్షిస్తోంది. చివరిసారిగా ఇక్కడ ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవం ఎప్పుడు జరిగందనే ఆనవాళ్లు, చారిత్రక ఆధారాలేమీ లేవు. అయితే మహాకుంబాభిషేక మహత్కార్యం నిర్వహించేందుకు శివాజ్ఞ లభించింది. ఈ ఏడాది ఏప్రిల్ నెల 19వ తేదీ నుంచి 23వ తేదీ వరకు మహాకుంభాభిషేక వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 23వ తేదీన 60 మంది పూజారులతో ఆలయ మహాకుంభాభిషేకం చేయనున్నారు.
ఏర్పేడు మండలం గుడిమల్లం పరశురామేశ్వరాలయం (ఇన్‌సెట్) గర్భాలయంలోని
పరశురామేశ్వరుని విగ్రహం
శివయ్య అనుగ్రహం
గతంలో ఎప్పుడు చేశారో కూడా తెలియని గొప్ప దైవకార్యం గుడిమల్లం ఆలయ మహా కుంభాభిషేక మహోత్సవానికి శివయ్య అనుగ్రహంతో నభూతో.. నభవిష్యతి అన్న రీతిలో జరగనుంది. గుడిమల్లం క్షేత్రంలో పూర్వపు ఆలయ కళాసౌందర్యం ఏమాత్రం దెబ్బతినకుండా పునర్నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి.
– వంశీకృష్ణ శర్మ, ఆలయ ప్రధాన అర్చకులు
జన్మ చరితార్థం
గుడిమల్లం పరశురామేశ్వరాలయ మహాకుంభాభిషేక మహోత్సవం జరిపించే అవకాశం పరమశివుడు నాకు కల్పించడం పూర్వ జన్మసుకృతం. చారిత్రక ఘట్టానికి సంబంధించి ఆలయంలో పనులు జరుగుతున్నాయి. ఈ వేడుకను నిర్వహించడంతో నా జన్మ చరితార్థమవుతుంది. – రామచంద్రారెడ్డి,
ఈఓ, గుడిమల్లం ఆలయం
చరిత్రలో నిలిచిపోయేలా
మహా కుంబాభిషేకం
గుడిమల్లం పరశురామేశ్వరాలయ కుంబాభిషేక మ హోత్సవం చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహించేందు కు ఏర్పాట్లు చేస్తున్నాం. దేవదాయశాఖ, పురావస్తు శాఖ సమన్వయంతో ఈ వేడుకలో పాల్గొనే సువర్ణావకాశం దక్కడం ఎన్నో జన్మల పుణ్యఫలం.
– బత్తల గిరిబాబు, గుడిమల్లం ఆలయ చైర్మన్
పరశురామేశ్వరునికి మహత్కార్యం
పరశురామేశ్వరునికి మహత్కార్యం
పరశురామేశ్వరునికి మహత్కార్యం
పరశురామేశ్వరునికి మహత్కార్యం
పరశురామేశ్వరునికి మహత్కార్యం
పరశురామేశ్వరునికి మహత్కార్యం


