సార్వత్రిక సమ్మె విజయవంతం
తిరుపతి కల్చరల్: దేశవ్యాప్తంగా చేపట్టిన సార్వత్రిక సమ్మెలో భాగంగా గురువారం తిరుపతిలో కార్మికులు చేపట్టిన సమ్మె విజయవంతమైంది. సమ్మె సందర్భంగా ఉదయం సంఘటిత, అసంఘటిత రంగాలకు చెందిన కార్మికులు వేలాది మంది కార్మికులు ఆర్టీసీ బస్టాండ్ వద్దనున్న అంబేడ్కర్ విగ్రహం వద్దకు చేరుకుని నగర వీధుల్లో ఎర్రజెండాలతో ర్యాలీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసి బహిరంగ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి వర్గ సభ్యుడు ప్రకాష్‌బాబు, సీపీఐ జాతీయ కంట్రోల్ కమిషన్ చైర్మన్ కె.నారాయణ మాట్లాడారు. నేతలు కందారపు మురళి, ఆర్.హరికృష్ణ, కె.రాధాకృష్ణ, కత్తి నరసింహారెడ్డి, రాజారెడ్డి పాల్గొన్నారు.


