శ్రీకాళహస్తిలో విస్తృత స్థాయి భద్రతా ఏర్పాట్లు
శ్రీకాళహస్తి:శ్రీకాళహస్తీవశ్వరాలయంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలో్‌ల్ భక్తుల భద్రత, రద్దీ నియంత్రణ, సౌకర్యాల నిర్వహణపై ఎస్పీ సుబ్బరాయుడు మంగళవారం పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమగ్ర భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్నందున ప్ర త్యేక బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అదనపు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరంతర పర్యవేక్షణ చే పట్టాలన్నారు. ఏఎస్పీలు రవిమనోహరఆచారి, శ్రీనివాసులు, డీఎస్పీలు మూర్తి, శ్రీనివాస్ పాల్గొన్నారు.


