యమలోకాలు | - | Sakshi
Sakshi News home page

యమలోకాలు

Feb 11 2026 8:49 AM | Updated on Feb 11 2026 8:49 AM

యమలోక

యమలోకాలు

పది రోజుల్లోనే ఐదుగురికి పైగా ఆత్మహత్య

యాజమాన్యాల నిర్లక్ష్యంతో తల్లిదండ్రులకు కడుపు కోత

నిద్రావస్థలో అధికార యంత్రాంగం

కలాశాలలు కాదు

యమలోకంలా ప్రైవేటు విద్యాసంస్థలు

కార్పొరేట్‌, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌, డిగ్రీ, ఇంజనీరింగ్‌, మెడికల్‌ కళాశాలలు విద్యార్థులకు యమలోకాన్ని తలపిస్తున్నాయి. నిత్యం విద్యార్థులకు ఏదో రకంగా వేధిస్తూ నరకం చూపించి ఆత్మహత్యకు కారణమవుతున్నాయి. విద్యను వ్యాపారం చేసిన ప్రభుత్వాలు కార్పొరేటు సంస్థల పక్షానే నిలబడడంతో అమాయక తల్లిదండ్రులకు కడుపు కోత మిగులుతోంది. –అశోక్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర వర్సిటీల కోర్డినేటర్‌, తిరుపతి

ఆత్మహత్యలకు అడుకట్ట వేయరా?

ప్రైవేటు విద్యాసంస్థల్లో వరుస ఆ త్మహత్యలు భయబ్రాంతులకు గు రిచేస్తున్నాయి. విద్యార్థులను ఒత్తిడికి గురిచేసి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్న సంస్థలపై చర్యలు శూ న్యం. బేరసారాలతో తల్లిదండ్రులను మభ్యపెట్టి తమ పనికానిచేస్తున్నారు. ప్రశ్నించి విద్యార్థి సంఘాలపై దారుణంగా దాడులు చేయడం, బెదిరించడం, కేసులు బనాయించడం చేస్తున్నారు.

– చిన్న, ఏఐఎస్‌ఎఫ్‌ ఎస్వీయూ ఇన్‌చార్జి, తిరుపతి

నిద్రావస్థలో బాబు సర్కారు

కళాశాలల్లో ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థుల తల్లిదండ్రులతో, అధికారులతో బేరసారాలకు దిగి తప్పులను కప్పిపుచ్చుకుంటూ సర్దుబాటు చేసుకుని, యథావిధిగా కార్యక్రమాలను కొనసాగిస్తూ రెచ్చిపోతున్నారు. అధికారులను తమదైనశైలిలో లొంగదీసుకుంటూ తమ పనికానిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్న, ఆత్మహత్యలు జరిగిన కళాశాలలపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా బాబు ప్రభుత్వం తమకేమి పట్టనట్టు వ్యహరిస్తూ నిద్రావస్థలో మునిగిపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తిరుపతి సిటీ: తమ బిడ్డ తమలా కష్టపడకూడదు..డాక్టరో..ఇంజినీరో కావాలి..ఉన్నత స్థాయిలో ఉండాలని తల్లిదండ్రులు ఆత్రుత పడుతుంటారు. దీనిని ఆసరాగా తీసుకుని ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థలు తిరుపతిలో పుట్టగొడులుల్లా పుట్టుకొచ్చాయి. దీనికి తోడు ఒకే కళాశాల పేరుతో ఐదు నుంచి ఏడేనిమిది బ్రాంచ్‌లను నెలకొల్పి, విద్యార్థులు, తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నాయి. రూ.లక్షల్లో ఫీజులు వసూలు చేయడంతోపాటు ఐఐటీ, మెడికల్‌ క్యాంపస్‌ల పేరుతో అదనంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. తల్లిదండ్రుల అమాయకత్వాన్ని క్యాష్‌ చేసుకుని, విద్యార్థులకు బట్టి చదువులను నేర్పుతూ రాత్రింబవళ్లు నరకం చూపిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఒత్తిడిని తట్టుకోలేక మానసిక రోగులుగా మారుతుండగా, మరికొందరు కళాశాలలో లైంగిక వేధింపులకు, ఫీజు చెల్లించాలనే ఒత్తిడి భరించలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

తీరు మారని ప్రైవేటు యాజమాన్యం

ఆత్మహత్యల పరంపర కొనసాగుతున్న ప్రైవేటు కళాశాలల తీరు మారలేదు. విద్యార్థులు కళాశాలల్లో చేరినంతవరకు తల్లిదండ్రుల కాళ్ల వేళ్లపడే యాజమాన్యాలు జుట్టు తమ చేతికి చిక్కిన తర్వాత తమ ప్రతాపం చూపుతున్నారు. తమ విద్యార్థిని చూసి పలుకరించేందుకు నెలకొకసారి తల్లిదండ్రులు కళాశాలకు వచ్చినా తమ పిల్లలను కలవనీయకుండా వారిపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఉదయం నాలుగు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు బట్టి చదువులను విద్యార్థులపై రుద్దుతూ కర్కశంగా వ్యవహరిస్తున్నారని ఇటు విద్యార్థులు అటు తల్లిదండ్రులు వాపోతున్నారు.

మా కళాశాలలో చేరితే ఫీజు రాయితీతో విద్యనందిస్తాం.. అన్ని సౌకర్యాలున్నాయి.. మంచి భవిష్యత్‌ ఉంటుంది.. రారారమ్మని పిలిచే కళాశాలలు విద్యార్థులు చేరిన తరువాత ఫీజు రాయితీలు ఎగ్గొట్టుతున్నాయి..జైళ్లను తలపించే హాస్టల్‌ గదుల్లో పడేస్తున్నాయి... మొత్తం ఫీజులు కట్టమని ఒత్తిడి తెస్తున్నాయి. దీనికితో లైంగిక వేధింపులు, ఒత్తిడితో కూడి బట్టీ చదువులు నెత్తిన మోపుతున్నాయి. ఫలితంగా పసిప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి.

ప్రైవేటు విద్యాసంస్థల్లో కొనసాగుతున్న ఆత్మహత్యలపర్వం

యమలోకాలు1
1/1

యమలోకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement