రేషన్ బియ్యం పట్టివేత
చంద్రగిరి: అక్రమంగా పాల వ్యానులో తరలిస్తున్న రేషన్ బియ్యం స్వాధీనం చేసుకుని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్న ఘటన మంగళవారం జరిగింది. సీఐ సురేష్ కుమార్ కథనం మేరకు.. పలమనేరుకు చెందిన కిషోర్ నుంచి ముల్‌బాగిల్‌కు చెందిన లక్ష్మీపతి రేషన్ బియ్యం కొనుగోలు చేసి, ముల్‌బాగిల్‌కు తరలిస్తున్నట్లు సమాచారం అందింది. ఈ క్రమంలో మండలంలోని తొండవాడ సమీపంలో రెవెన్యూ అధికారులతో కలసి వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో అనుమానాస్పదంగా వస్తున్న పాలవ్యానును తనిఖీ చేయగా వాహనంలో 6.5 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ లక్ష్మీపతిని అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించామని సీఐ సురేష్ కుమార్ తెలిపారు.


