ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు

Feb 11 2026 8:49 AM | Updated on Feb 11 2026 8:49 AM

ప్రభు

ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు

ప్రైవేటు విద్యాసంస్థల్లో ఘోరాలు జరుగుతున్నా అధికార యంత్రాంగం కానీ, ప్రభుత్వ పెద్దలు కానీ పట్టించుకోకపోవడం దారుణం. అమాయక విద్యార్థులను పొట్టన పెట్టుకుంటున్న యాజమాన్యాలపై చర్యలు శూన్యం. ఈ ఏడాది కేవలం రెండు నెలలు గడవ ముందే తిరుపతిలోని పలు విద్యాసంస్థల్లో సుమారు ఐదుగురు ఆత్మహత్యలు చేసుకోవడం దారుణం. బాధిత కళాశాలల గుర్తింపు రద్దు చేయాలి. –ప్రేమ్‌ కుమార్‌,

వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షులు, ఎస్వీయూ

వేధింపులతోనే ఆత్మహత్యలు

సంస్థ పేరుప్రతిష్టల కోసం ర్యాంకుల పేరుతో బట్టీ చదువులతో ఒత్తిడి చేయడం. విద్యార్థినులను మానసికంగా, శారీరకంగా, లైంగికంగా వేధింపులకు గురిచేయడంతో ఆత్మహత్యలు పెరుగుతున్నాయి. తల్లిదండ్రులు మేలుకోవాలి. చదువుతో పాటు విద్యార్థి ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత నిచ్చే సంస్థల్లోనే చేర్పించాలి. విద్యను వ్యాపారం చేసే విద్యాసంస్థలకు తల్లిదండ్రులు దూరంగా ఉండాలి.

–శ్రవంతి, పీడీఎస్‌ఓ జిల్లా కమిటీ సభ్యులు, తిరుపతి

కడుపుకోతకు కారకులెవరు?

ప్రైవేటు విద్యాసంస్థలు ధనార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నాయి. విద్యార్థులకు సరైన భోజన వసతి సౌర్యాలను కల్పించకుండా మానసిక రోగులను చేస్తున్నాయి. మార్కులే ప్రామాణికంగా వేధిస్తూ తల్లిదండ్రులను సైతం కలవనీయకుండా, సెలవులు ఇవ్వకుండా, కనీసం తమ సమస్యలను కన్న తల్లిదండ్రులకు చెప్పుకునేందుకు ఫోన్‌ సౌకర్యం కల్పించకుండా దారుణంగా వ్యవహరిస్తున్నాయి. దీంతో విద్యార్థులు ఒంటరితనానికి లోనై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

– సుందరరాజు, ఎన్‌ఎల్‌ఎస్‌ఏ వ్యవస్థాపక అధ్యక్షులు, తిరుపతి

ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు 
1
1/2

ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు

ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు 
2
2/2

ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement