నేడు వైఎస్సార్‌సీపీ విస్తృతస్థాయి సమావేశం
తిరుపతి మంగళం: పద్మావతిపురంలో బు ధవారం ఉదయం 10 గంటలకు తిరుపతి ని యోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్‌రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్‌సీపీ విస్తృత స్థా యి సమావేశం నిర్వహించనున్నట్లు పార్టీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో చిత్తూరు, తిరుపతి జిల్లాల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, ఉమ్మడి చిత్తూరు జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి, ఎమ్మెల్సీ డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మేయ ర్ శిరీష పాల్గొననున్నట్లు ఆయన తెలిపారు.
డిగ్రీ పరీక్ష కేంద్రం మార్పు
తిరుపతి సిటీ: ఎస్వీయూ పరిధిలో గురువారం నుంచి ప్రారంభం కానున్న యూజీ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి స్వల్ప మార్పు చేసినట్లు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ రాజామాణిక్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ పరీక్షల నేపథ్యంలో పద్మావతి డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడంతో అక్కడ పరీక్ష కేంద్రాలను స్థానిక ఎమరాల్డ్స్, గాయత్రి డిగ్రీ కళాశాలలకు మార్చామని పేర్కొన్నారు. ఎస్పీడబ్ల్యూ కళాశాలలో సెంటర్‌ను కేటాయించిన విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన తెలిపారు.
ఇంటర్ ప్రాక్టికల్స్‌కు
149 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్స్ మూడో రోజు పరీక్షకు 149 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 90 పరీక్ష కేంద్రాల్లో జరిగిన ప్రాక్టికల్స్‌కు 4,589 మంది గాను 4,506 మంది విద్యార్థులు, మధ్యాహ్నం 90 కేంద్రాల్లో జరిగిన పరీక్షకు 4,135 మందికి గాను 4,069 మంది హాజరయ్యారని తెలిపారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఆ ప్రకటనలో తెలిపారు.
శ్రీవారి దర్శనానికి 10 గంటలు
తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ మోస్తరుగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 11 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సోమవారం అర్ధరాత్రి వరకు 69,262 మంది స్వామివారిని ద ర్శించుకున్నారు. స్వామివారికి కానుకల రూ పంలో హుండీలో రూ.3.77 కోట్లు సమర్పించా రు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టికెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 10 గంటల స మ యం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


