ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ | - | Sakshi
Sakshi News home page

ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ

Feb 4 2026 6:57 AM | Updated on Feb 4 2026 6:57 AM

ఐదు ద

ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ

● అనుభవమే తప్ప..ఆ భూములకు పాసు పుస్తకాలే లేవ్‌ ● క్రయ, విక్రయాలు రుణ అర్హత శూన్యం

● అనుభవమే తప్ప..ఆ భూములకు పాసు పుస్తకాలే లేవ్‌ ● క్రయ, విక్రయాలు రుణ అర్హత శూన్యం

ఐదు శతాబ్దాలుగా భూములు సాగు చేసుకుంటున్నారు. తరాలుగా ఆ పుడమిని నమ్ముకునే జీవనం సాగిస్తున్నారు. అయినా ఆ పొలాలపై వారికి అనుభవం తప్ప, వారి సొంతం కావడం లేదు. వారి పేరున పట్టాదారు పాసు పుస్తకాలు లేవు. యాజమాన్య హక్కు పత్రాలు లేవు. వారికి ఆ భూముల క్రయవిక్రయాలకు అర్హత లేదు.. ఏ బ్యాంకులోనూ వారికి అప్పు పుట్టదు. పట్టాదారు పాసు పుస్తకాల కోసం యాభై ఏళ్లుగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు. అయినా ఫలితం దక్కలేదు. ఇదీ సైదాపురం మండలం కలిచేడు రైతులు దీనగాఽథ.

సైదాపురం: దున్నేవాడిది భూమి అంటూ ప్రభుత్వ ప్రకటలనలు కేవలం కాగితాలు, ప్రచారానికే పరిమితమవుతున్నాయి. 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు నేటి వరకు పట్టాదారు పాసుపుస్తకాలు లేవంటే ప్రతి ఒక్కరు అవాక్కవతారు. కేవలం ఆ రైతులు అండగల్‌లో మాత్రమే అనుభవదారులుగానే మిగిలిపోతున్నారు. కనీసం వన్‌బీలో అసలు ఆ రైతుల పేర్లే ఉండవు. దీంతో ఆ రైతులకు చిల్లిగవ్వ కూడా అప్పులు పుట్టడం లేదు. తాము సాగు చేసుకుంటున్న భూములకు పట్టాల్వివాలని గతంలో అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండాపోయింది. గతంలో ఇక్కడ పని చేసిన కొందరు అధికారులు వెంటనే పట్టాదారు పాసుపుస్తకాలు అందిస్తామంటూ ముందుకు వచ్చారు. దీంతో ఆయకట్టు రైతులంతా ఎకరాకు కొంత మొత్తం చందాలు వేసుకుని, మరీ అధికారులకు ముట్టజెప్పారు. అయితే ఆ అధికారులు బదిలీ అయిపోయారు. కానీ ఆ రైతులకు నేటికీ పట్టాదారు పాసుపుస్తకాలు మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోతోంది. ఈ సంఘటన మండలంలోని కలిచేడులో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. సైదాపురం మండలంలోని కలిచేడులో సుమారు 1800 ఎకరాల ఇనాం భూములున్నాయి. రాజాలు పాలించే సమయంలో ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సుమారు 50 ఏళ్ల నుంచి ఆ భూములను ఆ గ్రామానికి చెందిన వారు సాగు చేసుకుంటున్నారు. రెవెన్యూ రికార్డులో మాత్రం ఇప్పటికీ ఇనాం భూములుగానే చూపిస్తున్నారు. కేవలం అడంగల్‌లో మాత్రం సాగు చేసే రైతుల పేర్లును అనుభవదారులుగా నమోదు చేశారు. ఈ విషయమై గ్రామస్తులు పలుసార్లు ఉన్నతాధికారులకు విన్నవించుకోవడంతో అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ చొరవ చూపి ఆ భూములను సమగ్ర సర్వే చేసి, సాగు చేసుకుంటున్న వారందరికీ పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఆయన బదిలీ కావడంతో మరింత జాప్యం చోటు చేసుకుంది. ఆరెళ్ల కిందట ప్రతి రైతు వద్ద నగదు కూడా వసూలు చేశారు. హడావుడిగా సర్వే పనులు పూర్తి చేసి పట్టాదారు పాసుపుస్తకాలు ఇచ్చే విషయం మళ్లీ పెండింగ్‌ పండింది. నగదు చెల్లించిన రైతులకు ఏమి చేయాలో తెలియక ఆందోళన చెందారు. అప్పడు వసూలు చేసిన నగదును తీసుకున్న స్థానిక అధికారులు కూడా బదిలీ అయ్యారు. దీంతో రైతులు పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు చేయాలంటూ రెవెన్యూ కార్యాలయం చుట్టు ప్రదక్షిణలు చేస్తున్నారు. పాసుపుస్తకాలు లేకపోవడంతో ఏ బ్యాంకు నుంచి రైతులకు చిల్లిగవ్వ కూడా అప్పు పుట్టడంలేదు. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి తాము సాగు చేసుకుంటున్న భూములకు పాసు పుస్తకాలను మంజూరు చేయాలని కోరుతున్నారు.

కలిచేడు రైతులు

ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ 
1
1/2

ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ

ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ 
2
2/2

ఐదు దశాబ్దాలుగా నిరీక్షణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement