మహాకుంభాభిషేకానికి ముహూర్తం ఖరారు
నాగలాపురం: మండల కేంద్రంలోని టీటీడీ అనుబంధ ఆలయమైన వేదవళ్లి సమేత వేదనారాయణ స్వామి ఆల య కుంభాభిషేకానికి టీటీడీ ముహూర్తం ఖరారు చేసింది. రెండున్నరేళ్లుగా ఆలయంలో బాలాలయం పనులు జరుగుతున్నందున మూలస్థానం మూసివేసి, స్వామి వారి ఉత్సవమూర్తుల ద్వారా భక్తులకు దర్శనం కల్పించేవారు. వేదనారాయణుడి దర్శనాన్ని పునరుద్ధరించడానికి టీటీడీ చర్యలు చేపట్టింది. ఫిబ్రవరి 17న అంకురార్పణ, 18 నుంచి యాగశాల వైదిక కార్యక్రమాలు, హోమాలు నిర్వహించనున్నారు. ఈ నెల 22వ తేదీ ఉదయం గర్భాలయ మూలవర్లకు మహా సంప్రోక్షణ, నివేదనలు సమర్పించి, భక్తులకు స్వామి వారి దర్శనం కల్పించనున్నట్లు ఆలయాధికారి శ్రీనివాసులు తెలిపారు. ఇందులో భాగంగా మొదటి సారిగా రాముల వారి ఆలయ గోపురానికి, వేదవళ్లి తాయారు మండపానికి బంగారు వర్ణంతో, ముందు వైపు ఉన్న రాజగోపురానికి తెలుపు రంగులు వేసి సిద్ధం చేస్తున్నారు.


