నేడు తుమ్మలగుంట నుంచి ఆధ్యాత్మిక మహా పాదయాత్ర | - | Sakshi
Sakshi News home page

నేడు తుమ్మలగుంట నుంచి ఆధ్యాత్మిక మహా పాదయాత్ర

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

నేడు తుమ్మలగుంట నుంచి ఆధ్యాత్మిక మహా పాదయాత్ర

నేడు తుమ్మలగుంట నుంచి ఆధ్యాత్మిక మహా పాదయాత్ర

తిరుపతి రూరల్‌: తుమ్మలగుంట నుంచి శ్రీనివాసమంగాపురం వరకు చెవిరెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక మహా పాదయాత్ర గురువారం ప్రారంభం కానుంది. శ్రీనివాస మంగాపురంలోని కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడవాహన సేవను పురస్కరించుకుని పట్టువస్త్రాలు సమర్పించడంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ మాజీ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి దంపతులు ఆధ్యాత్మిక మహా పాదయాత్రను నిర్వహించడం ఆనవాయితీ. ఈనెల 12వ తేదీన గురువారం తుమ్మలగుంట నుంచి శ్రీనివాసమంగాపురం వరకు సాగే ఈ ఆధ్యాత్మిక మహా పాదయాత్రకు వందలాది మంది భక్తులు తరలిరానున్నారు. ఆధ్యాత్మిక పాదయాత్రలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి, చెవిరెడ్డి హర్షిత్‌రెడ్డి పాల్గొంటారు.

చదువుకోండి.. వ్యాపారజీవనం సాగించండి

తిరుపతి అర్బన్‌: చదువుకునే వ యస్సు ఉన్నవా రు చదువుకోండి..ఉద్యోగాలు చేయండి.. అలా గే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ గౌరవంగా జీవనం సాగించండని ట్రాన్స్‌జెండర్లకు కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ సూచించారు. జిల్లాలోని ఏడుగురు ట్రాన్స్‌జెండర్లకు గుర్తింపు కార్డులతోపాటు ధ్రువీకరణపత్రాల ను బుధవారం కలెక్టరేట్‌లో కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ అందజేశారు. విభిన్న ప్రతిభావంతులు, హి జ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి రాజా వినోద్‌ గుర్తింపు కార్డుల జారీకి దర ఖాస్తుల స్వీకరించారు. అనంతరం కలెక్టర్‌ దరఖాస్తులు చేసుకున్న అందరికీ గుర్తింపు కార్డులను జారీ చేయాలని ఆదేశాలు జారీ చేశా రు. దీంతో దరఖాస్తులు చేసుకున్న జి.జాహ్న వి, వి.లక్ష్మి, ఎస్‌.ఆయేషా, కే.రోహిణి, పి.హర్షి, బి.ప్రణతి, బి.మన్వితకి గుర్తింపు కార్డులను పంపిణీ చేశారు. ప్రభుత్వం నుంచి ట్రాన్స్‌జెండర్లకు అందాల్సిన అన్నింటిని అందించడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.

తలకోనకు

ప్రత్యేక బస్సు సర్వీసులు

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని తలకోనకు తి రుపతి, రైల్వేకోడూరు నుంచి ప్రత్యేక బస్సు స ర్వీసులు నడపనున్నట్లు డిపో మేనేజర్‌ సురేంద్రకుమార్‌ తెలిపారు. బుధవారం డిపోలోని అ న్ని అసోసియేషన్ల ప్రతినిధులతో ప్రత్యేక కో– ఆర్డినేషన్‌ సమావేశం నిర్వహించారు. తలకోన శైవక్షేత్రానికి గత ఏడాది నడిపిన ప్రత్యేక సర్వీసులు, ఈ ఏడాది నడపాల్సిన ప్రత్యేక సర్వీసుల గురించి చర్చించారు. భక్తులు, ప్రయా ణికుల సౌకర్యార్థం నిరంతరాయంగా బస్సులు నడపడంపై కార్యాచరణ రూపొందించాలన్నా రు. కాగా గత ఏడాది మహాశివరాత్రి సందర్భంగా తిరుపతి నుంచి తలకోనకు 70 సర్వీసులు, రైల్వే కోడూరు నుంచి 40 సర్వీసులు న డిపారు. అయితే ఈ సంవత్సరం సీ్త్రశక్తి పథకం అమల్లో ఉన్న విషయాన్ని గుర్తుంచుకుని, తి రుపతి నుంచి తలకోనకు 80 ప్రత్యేక సర్వీసులు, రైల్వేకోడూరు నుంచి తలకోనకు 50 ప్రత్యేక సర్వీసులు నడపాలని నిర్ణయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement