వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర | - | Sakshi
Sakshi News home page

వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర

Feb 13 2026 5:29 AM | Updated on Feb 13 2026 5:29 AM

వైభవం

వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర

చంద్రగిరి: కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్ర హ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి నిర్వహించి న గరుడ వాహన సేవకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్రను వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ఆలయం నుంచి ఆలయ పేష్కర్‌ రామకృష్ణ, లక్ష్మీహారాన్ని తిరుపతి పరిపాలన భవనానికి తీసుకొచ్చారు. అనంతరం లక్ష్మీహారానికి ప్రత్యేక పూజలు చేశారు. అ క్కడి నుంచి ఊరేగింపుగా లక్ష్మీహారం శోభాయాత్ర గు రువారం సాయంత్రం ఆలయం వద్దకు చేరుకుంది. అడిషనల్‌ ఈఓ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ కల్యా ణ వేంకటేశ్వర స్వామివారి గరుడసేవ రోజున లక్ష్మీహారాన్ని ఆలంకరించడం ఆనవాయితీగా వస్తోందన్నా రు. ఇందులో భాగంగా గరుడసేవ సందర్భంగా కల్యా ణ వేంకటేశ్వరస్వామి వారికి లక్ష్మీకాసుల హారాన్ని అలంకరించేందుకు తీసుకొచ్చినట్లు పేర్కొన్నారు. రాత్రి హారాన్ని స్వామివారికి అలంకరించారు.

వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర1
1/1

వైభవంగా శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement