స్విమ్స్‌ వైద్యం.. | - | Sakshi
Sakshi News home page

స్విమ్స్‌ వైద్యం..

Feb 5 2026 7:12 AM | Updated on Feb 5 2026 7:12 AM

స్విమ్స్‌ వైద్యం..

స్విమ్స్‌ వైద్యం..

స్విమ్స్‌లో పేదలకు వైద్యం అంతంతమాత్రమే అంతర్జాతీయ స్థాయి వైద్యం అని పొరుగు జిల్లాల నుంచి తిరుపతి రాక ఆరోగ్యశ్రీ .. అత్యవసర విభాగంలోకి నో ఎంట్రీ డబ్బులు పెట్టుకోలేరా.. అంబులెన్స్‌ దించొద్దు రుయాకు తీసుకెళ్లమని ఉచిత సలహా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు తీస్తున్న రోగులు

స్విమ్స్‌ వైద్యం.. కాసులే ముఖ్యం.. పేదలకు వైద్యం దక్కకపోవడం.. ఆరోగ్యశ్రీ చెల్లకపోవడమే ఇక్కడ ప్రత్యేకం..వాహనంలోనే రోగి స్థితిగతులపై ఆరా తీయడం.. బిల్లులు కట్టగలరా? లేదా?ని కూపీ లాగడం.. పేదలని తెలిస్తే తిరస్కరించడం.. ఆపై ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లండని ఉచిత సలహాలివ్వడం ఇక్కడి వైద్యుల నైజం.. ఇలా స్విమ్స్‌ వైద్యం పేదలకు అందని ద్రాక్షలా మారింది. పేదలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని స్విమ్స్‌ ఆస్పత్రికి వస్తే, ఇక్కడ పనిచేసే వైద్యుల బృందం వారికి ఊపిరి పోయలేని పరిస్థితి నెలకొంది. కళ్లు చెదిరే ఈ వాస్తవాలు జనవరి 27వ తేదీన సాక్షి నెట్‌వర్క్‌ పరిశీలనలో వెలుగు చూశాయి.

తిరుపతి టాస్క్‌ఫోర్స్‌: స్విమ్స్‌లో అంతర్జాతీయ స్థాయి వైద్యం అందిస్తున్నామంటూ మైకు కనిపిస్తే పాలకులు.. అధికారులు పోటీ పడి మాట్లాడుతుంటారు. ఇది నమ్మి పొరుగు జిల్లాల నుంచి సైతం రోగులు ఇక్కడికి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగున వస్తున్నారు. వ్యయ ప్రయాసలకోర్చి తీరా ఇక్కడికి వచ్చాక బెడ్లు ఖాళీలేవంటూ వెనక్కి పంపిస్తున్నారు. వైద్యం కోసం ఎంత మొరపెట్టుకున్నా రోగికి అత్యవసర విభాగంలో అడ్మిషన్‌ ఇవ్వకపోవడంతో తమ వారికి సకాలంలో వైద్యం అందించలేకపోయామంటూ బోరున విలిపిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు ప్రతిరోజు పదుల సంఖ్యలో రోగికి, వారి కుటుంబాలకు స్విమ్స్‌లో ఎదురవుతున్నాయి. ఇది ఒకరిద్దరి పరిస్థితి కాదు. నిత్యం ప్రాణాపాయ స్థితిలో వైద్యం కోసం పదుల సంఖ్యలో వచ్చే రోగులకు ఎదురవుతున్న దుస్థితి. డబ్బులు కట్టే పరిస్థితి లేదని గుర్తిస్తే బెడ్లు లేవని నిర్దాక్షిణ్యంగా వెనక్కి పంపిస్తున్నారు. ఆరోగ్యశ్రీ అంటే అత్యవసర విభాగంలోకి నో ఎంట్రీ చెప్పేస్తున్నారు. అన్నమయ్య జిల్లా నుంచి వచ్చిన రోగికి మంగళవారం స్విమ్స్‌ వైద్యు లు ఆరోగ్యశ్రీ వర్తించదని చెప్పడంతో రుయాను ఆశ్రయించాల్సిన పరిస్థితి వచ్చింది. ముఖ్యులతో సిఫార్సు చేయించుకుంటే అత్యవసర విభాగంలో ఆరోగ్యశ్రీ కింద ఒకరిద్దరికి ఇక్కడ అడ్మిషన్‌ లభిస్తుంది. మిగిలిన రోగులను భయపెట్టి, నిర్దాక్ష్యింగా వచ్చిన దారినే వెనక్కి తరిమేస్తున్నారు. ప్రాణాలు పోయే పరిస్థితిలో అర్ధరాత్రి వచ్చినా కనికరం లేకుండా మరో ఆస్పత్రికి వెళ్లిపోండని తెగేసి చెబుతున్నారు. దీంతో పేదలకు ఇక్కడ అత్యవసర వైద్యం అంత ఈజీగా అందడం లేదు.

అత్యవసర విభాగంలో

ఆరోగ్యశ్రీ లేదంటున్న అధికారులు

సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలకోర్చి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని అత్యవసర వైద్యం కోసం వస్తున్న రోగులకు స్విమ్స్‌ చుక్కెదురు అవుతోంది. అత్యవసర విభాగంలో ఆరోగ్యశ్రీ వర్తించదంటూ వైద్య అధికారులు తేల్చి చెబుతున్నారు. అడ్మిషన్‌ కావాలంటే ముందు డబ్బులు చెల్లించాలని, ఇక్కడ వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా చెల్లిస్తేనే రోగిని లోనికి తీసుకుంటామంటూ నిర్మొహమాటంగా తేల్చి చెబుతున్నారు. ఆరోగ్యశ్రీతో పాటు వైద్య నిబంధనలకు విరుద్ధమని తెలిసినా స్విమ్స్‌ వైద్యాధికారులు ఆరోగ్యశ్రీ రోగి అంటే నో ఎంట్రీ అంటున్నారు. రోజు అడ్మిట్‌ అయ్యే రోగుల్లో 10 శాతం మంది ఆరోగ్యశ్రీ రోగులు ఉండడం లేదని తెలుస్తోంది. ఎక్కువ శాతం మంది ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రభుత్వాస్పత్రికో, ప్రైవేటు ఆస్పత్రికో పరుగులు తీస్తున్నారు. స్విమ్స్‌కు పెరుగుతున్న రోగుల తాకిడిని దృష్టిలో ఉంచుకుని అత్యవసర విభాగాన్ని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం 70 నుంచి వంద పడకలతో ఎమర్జెన్సీ విభాగాన్ని నిర్వహించాలని సిఫార్సులున్నా టీటీడీ ఆ దిశగా చర్యలు తీసుకునేందుకు వెనుకడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది.

అంబులెన్స్‌ దించకుండానే వెనక్కి..

అరచేతిలో ప్రాణాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement