సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి | - | Sakshi
Sakshi News home page

సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి

Feb 5 2026 7:12 AM | Updated on Feb 5 2026 7:12 AM

సనాతన

సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి

– టీటీడీ ఇన్‌చార్జి ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరి

తిరుపతి సిటీ: శాస్త్ర సంప్రదాయాలకు సాంకేతికతను జోడించి వారసత్వ సంపదను సంరక్షించి భావి భారతావనికి అందించాలని టీటీడీ ఇన్‌చార్జి ఈఓ సీహెచ్‌ వెంకయ్య చౌదరి పిలుపునిచ్చారు. తిరుపతిలోని ఎస్వీ వేద విశ్వవిద్యాలయంలో బుధవారం మూడు రోజుల పాటు జరగనున్న అర్చక శిక్షణ తరగతులను ఆయన వీసీ రాణి సదాశివమూర్తితో కలసి జ్యో తి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీటీడీ పరిధిలోని పలు ఆలయాల్లో విధులు నిర్వర్తిస్తున్న అర్చకులు, పరిచారకులు, వేద పారాయణదారులు నిత్యం నిర్వహించే కై ంకర్యాలను మరింత నియమబద్ధంగా నిర్వహించేందుకు శిక్షణ తరగతులు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇందులో 35 మంది అర్చకులు, పరిచారకులు, 15 మంది వేద పారాయణదారులకు మూడు రోజులపాటు పునఃశ్చరణ తరగతులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ శిక్షణ కార్యక్రమాలు నిరంతరాయంగా కొనసాగాలని, మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త అంశాలు, సాంకేతిక పరిజ్ఞానాన్ని తెలుసుకునేందుకు దోహదపడతాయని అన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి

సూళ్లూరుపేట: పట్టణంలోని హోలీక్రాస్‌ సెంటర్‌ వద్ద చైన్నె–కోల్‌కత్తా జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీసిటిలోని సీఈటీసీ కంపెనీలో పని చేస్తున్న ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. సూళ్లూరుపేట గాండ్లవీధిలో నివాసముంటున్న గోపిశెట్టి శ్రావణి (31) ఉదయాన్నే కంపెనీ బస్సు ఎక్కి డ్యూటీకి వెళ్లింది. ఆమె సమీప బంధువులు ఫోన్‌ చేసి బుధవారం పొదుపునకు సంబంధించి తహసీల్దార్‌ కార్యాలయంలో మీటింగ్‌ ఉందని చెప్పారు. ఆమె బస్సు ఆపి తడ రెవెన్యూ కార్యాలయం వద్ద దిగింది. సూళ్లూరుపేటకు వచ్చేందుకు అవతలి వైపు రోడ్డు పక్కకెళ్లి అదే కంపెనీలో పనిచేస్తున్న ఎల్లా రాజశేఖర్‌ (32) తడ నుంచి సూళ్లూరుపేటకు మోటార్‌సైకిల్‌పై వస్తుండగా ఆపింది. అతనితో పాటు మోటార్‌సైకిల్‌పై సూళ్లూరుపేటకు వస్తూ హోలీక్రాస్‌ సర్కిల్‌ వద్ద షార్‌రోడ్డులో మలుపు తిరిగే సమయంలో వెనుకనే వస్తున్న కంటైనర్‌ ఢీకొని, వారు కింద పడ్డారు. కంటైనర్‌ శ్రావణిపై దూసుకెళ్లడంతో ఆమె మృతి చెందింది. తమిళనాడులోని ఆరణి పట్టణం సుబ్రమణ్యంనగర్‌కు చెందిన ఎల్లా రాజశేఖర్‌ మోటార్‌సైకిల్‌తోపాటు పక్కకు పడడంతో తీవ్రమైన గాయపడిన గమినించిన స్థానికులు 108 అంబులెన్స్‌కు ఫోన్‌ చేసి స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. సమాచారమందుకున్న ఎస్‌ఐ బ్రహ్మనాయుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించి, మృతుల బంధువులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి 1
1/3

సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి

సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి 2
2/3

సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి

సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి 3
3/3

సనాతన ధర్మాన్ని భావిభారతావనికి అందించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement