రేపటి నుంచి ఇంటర్ స్పెల్–2 ప్రాక్టికల్స్
తిరుపతి సిటీ: జిల్లావ్యాప్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి జరుగుతున్న ఇంటర్ స్పెల్–1 ప్రాక్టికల్స్ గురువారంతో ముగియనున్నాయి. శుక్రవారం నుంచి స్పెల్–2 ప్రాక్టికల్స్ జిల్లాలోని 89 పరీక్ష కేంద్రాల్లో ఈ నెల 10వ తేదీ వరకు నిర్వహించనున్నారు. అలాగే నాలుగో రోజైన బుధవారం జిల్లా వ్యాప్తంగా జరిగిన ప్రాక్టికల్స్‌కు ఉదయం సెషన్‌లో 33 మంది, మధ్యాహ్నం సెషన్‌లో 54 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.
7న ఎస్వీయూలో జాబ్‌మేళా
తిరుపతి సిటీ: ఎస్వీయూ ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో ఈ నెల 7వ తేదీన జాబ్‌మేళా నిర్వహించనున్నట్లు కార్యాలయ అధికారి టి శ్రీనివాసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఎస్‌ఎస్‌ఎస్సీ, ఇంటర్, ఐటీఐ, డిప్లోమో, డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైన యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పేరొందిన ఎమ్‌ఎన్‌సీ కంపెనీల ప్రతినిధులు జాబ్‌మేళాకు హాజరై సుమారు 700 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు వర్సిటీలోని ఎంప్లాయిమెంట్ కార్యాలయాన్ని సంప్రదించాలని సూచించారు.
శ్రీవారి సేవలో యాదుగిరి యతిరాజ మఠం పీఠాధిపతి
తిరుమల: మేలుకొటే యాదుగిరి యతిరాజ మ ఠం పీఠాధిపతి యాదుగిరి యతిరాజ స్వామిజీ బుధవారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా రు. తిరుమల బేడి ఆంజనేయ స్వామి వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ పేష్కార్ రామకృష్ణ, పోటు పేష్కార్ మునిరత్నం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. శ్రీవారి ప్రత్యేక దర్శనం చేయించిన అనంతరం ఆయనకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.
శ్రీవారి దర్శనానికి 6 గంటలు
తిరుమల: తిరుమలలో బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. మంగళవారం అర్ధరాత్రి వరకు 69,389 మంది స్వామి వారిని దర్శించుకున్నారు. 20,247మంది భక్తు లు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కా నుకల రూపంలో హుండీలో రూ.3.72 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టికెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టి కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 6 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవే శ దర్శనం టికెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు.


