● జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ● ప్రశ్నార్థకంగా విద్
●
విద్యుత్ మీటర్ రీడర్ల భవిషత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన స్మార్ట్ మీటర్ల బిగింపే కారణమవుతోంది. గత సార్వత్రిక ఎన్నికలకు ముందు ‘స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగల గొట్టండి.. విద్యుత్ బిల్లులు చెల్లించకండి’ అంటూ టీడీపీ అగ్ర నాయకులు
పిలుపునిచ్చారు. అధికారంలోకి రాగానే కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశాలు జారీచేసింది. తొలుత ప్రభుత్వ కార్యాలయాలు, ప్రస్తుతం గృహ వినియోగదారులకు సైతం చకచకా బిగించేస్తున్నారు. ఈ క్రమంలో మీటర్ రీడర్లు ఉపాధి లేక రోడ్డున పడే దుస్థితి నెలకొంటోందని పలువురు ఆవేదన చెందుతున్నారు.
పుత్తూరు: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో విద్యుత్ మీటర్ల రీడర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 మందికిపైగా మీటర్ రీడర్స్ పనిచేస్తున్నారు. వీరు ప్రతినెలా ఇంటింటికీ వెళ్లి రీడింగ్ తీసి విద్యుత్ బిల్లులు అందిస్తారు. ఇందుకు రీడర్లకు ఒక్కో బిల్లుకు పట్టణాల్లో రూ.3.6 పైసలు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.3.73 పైసలను విద్యుత్ యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. ఈ విద్యుత్ బిల్లుల రీడింగ్ నిర్వహణ కోసం టెండర్ ఎత్తుకొన్న కాంట్రాక్టర్‌కు మిషన్, పేపర్ కాస్టుకు సంబంధించి అదనంగా మరో రూ.4 చెల్లిస్తుంది. ఇలా జిల్లాల వారిగా కాంట్రాక్టర్లు ఉంటారు.
గతం ప్రభుత్వంలో కొండంత భరోసా
సంబంధిత కాంట్రాక్టర్లు తమకు రూ.3.3 పైసలు చెల్లిస్తున్నారంటూ రీడర్లు గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన నాటి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మీటర్ రీడర్లకు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో వేతనాలు వేయాలని విద్యుత్ యాజమాన్యానికి ఆదేశాలు జారీచేశారు. రీడర్లకు కొండంత అండగా నిలిచారు.
బొక్కేస్తున్న ‘యువగళం’
చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మీటర్ రీడర్స్‌కు కష్టాలెక్కువయ్యాయి. నాటి కాంట్రాక్టర్లను తొలగించి యువగళం కాంట్రాక్టర్లు రంగంలోకి దిగారు. ప్రస్తుత కాంట్రాక్టర్లు రీడర్లకు రూ.2.8 పైసలు, కొన్నిచోట్ల రూ.3 వంతున ఇస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే ఇచ్చింది తీసుకో.. లేకుంటే వెళ్లిపోండంటూ బెదిరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.
స్మార్ట్‌గా రోడ్డుపైకి!
శ్రమ దోపిడీ ఓ పక్క జరుగుతుండగా ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ మీటర్ల కారణంగా తమ ఉద్యోగ భద్రతే ప్రమాదంలో పడిందని రీడర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం స్మార్ట్ మీటర్లు పూర్తి స్థాయిలో ఏర్పాటైతే రీడర్లు బిల్లులు తీసి ఇచ్చే పరిస్థితి ఉండదు. అందులోని చిప్ ద్వారా రీడింగ్‌ను విద్యుత్ కార్యాలయం నుంచే సేకరించి, మొబైల్ రీచార్జ్ తరహాలో ముందస్తు చెల్లింపులతో విద్యుత్ వినియోగం రానుంది. దీంతో విద్యుత్ రీడర్లు కనుమరుగుకానున్నారు.
15 ఏళ్లుగా పనిచేస్తున్నా..
గత 15 ఏళ్లుగా మీటర్ రీడర్‌గా పనిచేస్తున్నా. ప్రస్తుతం వస్తున్న వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నా. ప్రస్తుతం స్మార్ట్ మీటర్ల ఏర్పాటుతో ఉద్యోగ భద్రత ఆందోళనకరంగా ఉంది. భవితవ్యం అర్థం కావడం లేదు.
– సుబ్రమణ్యం, మీటర్ రీడర్, పుత్తూరు
ఉద్యోగ భద్రత కల్పించాలి
మీటర్ రీడర్స్‌కు విద్యుత్ సంస్థలోనే పని కల్పించండి. షి ప్టు ఆపరేటర్లుగా, వాచ్ టు వార్డ్, ఫీల్డ్ అసిస్టెంట్లు, బ్రేక్ డౌన్ గ్యాంగ్, వాచ్‌మెన్, ఆఫీస్ బాయ్, డ్రైవర్ వంటి విధుల్లో చేర్పించండి. మా కుటుంబాలకు అండగా నిలవండి. –సి.రమేష్,
ఉపాధ్యక్షుడు,ఏపీ విద్యుత్ మీటర్ రీడర్స్ కమిటీ
విజ్ఞప్తి చేశాం
ప్రభుత్వానికి, విద్యుత్ ఉన్నతాధికారులకు పలుమార్లు మా ఉద్యోగ భద్రతపై విజ్ఙాపనలు అందజేశాం. ప్రభుత్వం నుంచి సానుకూల సందేశాలు రాలేదు. ఉపాధి చూపమని వేడుకొంటున్నాం. ప్రభుత్వం కనికరం చూసుతుందని ఆశిస్తున్నాం
– యువరాజ్, మీటర్ రీడర్, పుత్తూరు
● జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ● ప్రశ్నార్థకంగా విద్
● జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ● ప్రశ్నార్థకంగా విద్
● జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ● ప్రశ్నార్థకంగా విద్
● జోరుగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ● ప్రశ్నార్థకంగా విద్


