నమో..భూతనాథ
నిరసనలతో మొదలై.. సమ్మెకు సిద్ధమవుతున్న ఉద్యోగులు పనిభారం తగ్గించాలని ప్రధాన డిమాండ్ జిల్లాలో ఇప్పటి వరకు 2450 మందికి షోకాజ్ నోటీసులు
శ్రీకాళహస్తి: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రాత్రి భూతవాహనంపై ముక్కంటీశుడు, శుకవాహనం జ్ఞానప్రసూనాంబ ఊరేగారు. ఉదయం స్వామివారు సూర్యప్రభ వాహనంపై, అమ్మవారు చప్పరంపై భక్తులకు దర్శనమిచ్చారు. సూర్యప్రభ వాహనంపై పరమశివుడు సర్వాలంకార శోభితుడై విహరిస్తుండగా మూషిక వాహనంపై వినాయకస్వామి, శ్రీవళ్లి, దేవసేన సమేత కుమారస్వామి, చండికేశ్వరుడు, భక్తన్నప్ప చప్పరాలపై స్వామి అమ్మవార్ల వెంట అనుసరించారు. మంగళ వాయిద్యాలు, మేళతాళాలు, కోలాటాలు, భజన బృందాలు, భక్తులు శంఖం ఊదుతూ వెళుతుండా స్వామిఅమ్మవార్ల పురవిహారం చేశారు. పురవీధుల్లో ఊరేగుతున్న స్వామి అమ్మవార్లను భక్తులు దర్శించుకుని కర్పూర హారతులు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్, కొట్టేసాయి, ఈఓ బాపిరెడ్డి, పాలకమండలి సభ్యులు, ఆలయాధికారులు తదితరులు పాల్గొన్నారు.
నోటీసులు ఇస్తున్నారు
వలంటీర్లు చేస్తున్న పనులతోపాటు పదుల సంఖ్య లో సర్వేలు చేయిస్తున్నారు. సర్వేల అంశంలో పదే పదే టార్గెట్‌లు ఇస్తున్నారు. ప్రతి స ర్వేకు ఓటీపీలు చెప్పాల్సి వస్తుంది. అయితే పలు కుటుంబాలకు చెందిన వారు ఓటీపీలు చెప్పడానికి ఇష్టపడడం లేదు. దీంతో టార్గెట్ లు పూర్తి చేయలేకపోతు న్నాం. ఈ క్రమంలో నోటీసులు జారీ చేస్తున్నారు. దీంతో ఆందోళన తప్పడం లేదు. – శ్రీనివాసులు,
సచివాలయ ఉద్యోగి, శ్రీకాళహస్తి
సర్వేలతో సతమతం
ఉదయం 7.30 నుంచే సర్వేలతో ఆందోళన తప్పడం లేదు. రాత్రి 10 గంటల వరకు సర్వేలతోనే సతమ తం అవుతున్నాం. మాకు పండుగలు లేవు.. కుటుంబం లేదు.. ఇదే పనిలో ఉంటున్నాం. ఈ ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం. మండలస్థాయి నుంచి కలెక్టర్ స్థాయి వరకు సమస్యలపై మొరపెట్టుకున్నాం. అయినా ఒత్తిడిని ఎవరూ తగ్గించడం లేదు. దీంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు.
– వెంకటేశ్వర్లు,
సచివాలయ ఉద్యోగి, తిరుపతి
కలెక్టరేట్ వద్ద ధర్నా చేస్తున్న సచివాలయ ఉద్యోగులు(ఫైల్)
తిరుపతి అర్బన్: బాబు సర్కారులో సచివాలయాలు సర్వే కేంద్రాలుగా మారాయి. దీంతో సచివాలయ ఉద్యోగులు క్షేత్రస్థాయికే పరిమితం అవుతున్నారు. ఫలితంగా కార్యాలయాల్లో సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేక ప్రజలు ఇక్కట్లు పడుతున్నారు. గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం 2022లో అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి రోజు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. జిల్లాలో 691 గ్రామ, వార్డు సచివాలయాల్లో 5,625 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సచివాలయ ఉద్యోగులకు వేధింపులు తప్పడం లేదు. ఇప్పటి వరకు 2,450 మందికి చిన్నపాటి కారణాలతో షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు చెబుతున్నారు. ఓ వైపు సచివాలయాల కుదించారు. మరోవైపు ఉద్యోగుల సంఖ్యను తగ్గించారు. ఇంకోవైపు పదుల సంఖ్యలో సర్వే బాధ్యతలు అప్పగించారు. గతంలో వలంటీర్లు చేస్తున్న అన్ని పనులు సచివాలయ ఉద్యోగులకు అప్పగించడంతో వారంతా ఆందోళన చెందుతున్నారు. పనిభారం తగ్గించాలని 20 నెలలుగా మొత్తకుంటున్నా చంద్రబాబు సర్కార్ నిమ్మకునీరెత్తినట్లుగా వ్యవహరిస్తోంది. దీంతో పని ఒత్తిడి తట్టుకోలేక రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో సచివాలయ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఈ పరిస్థితులు మరింత దారుణంగా మారకమునుపే నిరసనలు చేపట్టాలని ఉద్యోగులు భావిస్తున్నారు. మృతి చెందినవారికి శాంతి కలగాలంటూ నేడు, రేపో కొవ్వుత్తుల ర్యాలీని జిల్లా వ్యాప్తంగా నిర్వహించడానికి ఉద్యోగులు సిద్ధం అవుతున్నారు.
చీటికిమాటికి నోటీసులు
చిన్న చిన్న విషయాలకు సైతం సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇచ్చేస్తున్నారు. దీంతో వారందరికీ ఆందోళన తప్పడం లేదు. గత ఏడాది ఆగస్టులో హర్‌ఘర్ తిరంగా ర్యాలీకి రాలేదంటూ ఏకంగా 281 మందికి మెమోలు జారీ చేయడాన్ని ప్రశ్నిస్తున్నారు. దీంతో వారంతా వలంటీర్ల చేస్తున్న అన్ని పనులు తమ చేత చేయించడం సరికాదంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారని పలువురు మండిపడుతున్నారు. న్యాయమైన కోర్కెలను నెరవేర్చకపోగా తమను చిన్నచూపు చూస్తూ ఎగతాళి చేస్తున్నారని పలువురు ఆవేదన చెందుతున్నారు. సంబంధం లేని విధులు అప్పగించడమే కాక సర్వేల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులమైన తాము ఇంటింటికీ వెళ్లి సర్వేలు చేయాల్సి రావడంతో పలువురు ఓటీపీలు చెప్పడానికి ఇష్టపడడం లేదంటున్నారు. పదే పదే సర్వేల టార్గెట్‌తో మానసికంగా బాధపెడుతున్నారని పలువురు ఆందోళన చెందుతున్నారు. ధర్నాలు, నిరసనలు చేపట్టినా ప్రయోజనం ఉండకపోవడంతో దిక్కులు చూస్తున్నారు.
బ్రహ్మోత్సవాల్లో నేడు
మూడో తిరునాళ్లు: గాంధర్వ రాత్రి (మాఘ బహుళ ఏకాదశి)
వాహన సేవలు
ఉదయం 9గంటలకు: హంస–యాళి వాహనసేవ
ఉభయదాతలు: కీ.శే. చిట్టాప్రగడ సీతారామంజనేయుడు, గుడివాడ, కృష్ణాజిల్లా
రాత్రి 8గంటలకు రావణుడు – మయూర వాహనసేవ
ఉభయదాతలు : జూలుగంటి సుబ్బారావు, నాగలక్ష్మి శ్రీకాళహస్తి
సచివాలయ ఉద్యోగుల జిల్లా సమాచారం
గత ప్రభుత్వంలో సచివాలయాలు 691
గతంలో ఉద్యోగులు 5,625 మంది
కూటమి సర్కారులో
సచివాలయాలు 353కి కుదింపు
నేడు ఉద్యోగులు 3,650
మిగిలిన 1,975 మందిని
వివిధ విభాగాల్లో కేటాయింపు
సర్వేలతో క్షేత్రస్థాయికే పరిమితం
బాబు సర్కారు సచివాలయాలను సర్వేలాలయాలుగా మార్చేసింది. పండుగలు.. పబ్బాలు.. సెలవులు లేకుండా నిత్యం ఉదయం నుంచి రాత్రి వరకు సర్వేలపై సర్వేలు చేయిస్తుండడంతో సచివాలయ ఉద్యోగులు మానసికంగా కుంగిపోతున్నారు. పనిఒత్తిడిని తట్టుకోలేక కొంత మంది ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాగా సచివాలయ ఉద్యోగులు సర్వేలతో క్షేత్రస్థాయికే పరిమితమై కార్యాలయాల్లో కనిపించడం లేదు.
నమో..భూతనాథ
నమో..భూతనాథ
నమో..భూతనాథ
నమో..భూతనాథ


