ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా? | - | Sakshi
Sakshi News home page

ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా?

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

 ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా?

ఏనుగులను చంపి దంతాలను సేకరిస్తున్నారా?

ఏనుగులు అడవిలో మృతిచెందినా, లేక వేటగాళ్లు నాటు తుపాకులతో, నల్లమందు ఉండలతో చంపినా వాటి నుంచి దంతాలను సేకరించే అవకాశాలున్నాయి. గతంలో హొగినేకళ్‌ అడవుల్లో వీరప్పన్‌ హయాంలో ఏనుగు దంతాల స్మగ్లింగ్‌ సాగింది. కౌండిన్య అడవిలోంచి మదపుటేనుగులు శేషాచలం అడవుల్లోకి వెళుతుంటాయి. ఏపీ, తమిళనాడు అడవుల్లో ఇలాంటి కార్యక్రమాలు సాగేందుకు అనుకూలంగా ఉంటుందనే మాట వినిపిస్తోంది. మోర్థాన అడవిలో మూడు ఏనుగులు మృతి చెందిన విషయం అక్కడి అటవీశాఖకు నెల దాకా తెలియ దంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement
 
Advertisement
Advertisement