టాలెంట్ ఫెస్ట్‌కు విశేష స్పందన
తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత వర్సిటీలో రెండు రోజులుగా జరుగుతున్న నేషనల్ సాంస్క్రిట్ స్టూడెంట్స్ ఫెస్ట్–2026కు విశేష స్పందన లభించింది. వర్సిటీలో రెండో రోజు గురువారం దేశంలోని 24 యూనివర్సిటీల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు పాల్గొని వారి శాస్త్ర ప్రతిభను చాటుకున్నారు. ఇందులో భాగంగా గురువారం జరిగిన ప్రతిభా పోటీల్లో వేద భాష్య భాషణ, వ్యాకరణ శాస్త్ర భాషణ, సాహిత్య శాస్త్ర భాషణ, వేదాంత శాస్త్ర భాషణ, జ్యోతి ష్య శాస్త్ర భాషణ పోటీలను నిర్వహించారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన విద్యార్థులకు శనివారం జరిగే ముగింపు కార్యక్రమంలో అవార్డులు, బహుమతులను అందజేయనున్నారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్లుగా సాహిత్య విభాగ సహాచార్యులు డాక్టర్ భరత్ భూషణ్ రత్, డాక్టర్ ప్రదీప్ కుమార్ భాగ్, అడిషనల్ కోఆర్డినేటర్గా వ్యాకరణ విభాగ అధ్యాపకులు డాక్టర్ ఉదయన హెగ్డే వ్యవహరించారు.
6 ఎరచ్రందనం దుంగలు స్వాధీనం
తిరుపతి అన్నమయయసర్కిల్:శ్రీకాళహస్తి– పిచ్చాటూరు మార్గంలో కారులో ఎరచ్రందనం దుంగలు తరలిస్తున్న ఇద్దరు స్మగ్లర్లను టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. రవాణాకు ఉపయోగించిన కారును సీజ్‌చేసి ఆరు ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్‌ఐ సాయి గిరిధర్‌కు చెందిన ఏఆర్‌ఎస్‌ఐ ఈశ్వర్‌రెడ్డి బృందం, ఎఫ్‌ఆర్‌ఓ పి.సుభాష్ గురువారం కేవీబీపురం మండలం వద్దకు చేరుకున్నారు. స్థానిక ఎఫ్‌బీఓ సురేష్ కుమార్‌తో కలసి మారప్పరెడ్డి కండ్రిగ చెక్ పోస్టు వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. అటువైపు వేగంగా వచ్చిన ఒక కారు టాస్క్‌ఫోర్సు పోలీసులను చూసి కొద్ది దూరం ముందుగా ఆపేశారు. అందులో నుంచి ఇద్దరు వ్యక్తులు దిగి పారిపోవడానికి ప్రయత్నించారు. టాస్క్‌ఫోర్సు పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. కారులో ఆరు ఎరచ్రందనం దుంగలు లభించాయి. అదుపులోకి తీసుకున్న వారిని అరెస్టు చేసి విచారించగా, తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తులుగా గుర్తించారు. కారు సహా వారిని తిరుపతి టాస్క్‌ఫోర్సు పోలీసు స్టేషన్‌కు తరలించారు. వీరిని డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ ఖాదర్ బాషా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రతి రోగికీ నాణ్యమైన వైద్య సేవలు
తిరుపతి తుడా: స్విమ్స్ ఆస్పత్రికి అత్యవసర వైద్య సేవల కోసం విచ్చేస్తున్న ప్రతి రోగికి నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామని మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ రామ్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్విమ్స్ ఎమెర్జెన్సీ విభాగంలో రోగులకు అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని, స్విమ్స్ వైద్యం రావద్దంటోందని ప్రచురించిన కథనం అవాస్తమని తెలిపారు. ఆస్పత్రిలో రోగులకు బెడ్, వెంటిలేటర్ వంటి సౌకర్యాలు అందకపోయినా, అడ్మిషన్ నిరాకరించినా వెంటనే మెడికల్ సూపరింటెండెంట్ 94935 47803, ఆర్‌ఎంఓ 9866356239 నంబర్లకు ఫిర్యాదు చేయాలన్నారు.
టాలెంట్ ఫెస్ట్‌కు విశేష స్పందన


