ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి
తిరుపతి క్రైమ్: నగరంలోని పూర్ణకుంభం సర్కిల్ వద్ద మంగళవారం తెల్లవారుజామున ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. నిద్ర మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఫుట్‌పాత్ నుంచి దొర్లిపడిన సమయంలో, అటు వెళుతున్న ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు అతని కాలి మీదుగా దూసుకెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే గమనించి గాయపడిన వ్యక్తిని తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రమాదానికి కారణమైన బస్సు తిరుపతి నుంచి తిరువణ్నామలైకి వెళుతున్న చిత్తూరు–2 డిపోకు చెందిన ఆర్టీసీ బస్సుగా పోలీసులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో, అతడిని గుర్తు తెలియని వ్యక్తిగా నమోదు చేశారు. మృతుడిని ఎవరైనా గుర్తిస్తే తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.
మహిళ మెడలో బంగారు గొలుసు అపహరణ
పాకాల: గుర్తు తెలియని దుండగుడు మహిళ మెడలో బంగారు గొలుసు అపహరించిన సంఘటన మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు కథనం మేరకు.. తెలంగాణ యాత్రికులు ఆలయాల సందర్శన యాత్రలో భాగంగా దామలచెరువు మీదుగా వెళుతూ వేకువ జామున టీ, కాఫీలు తాగడానికి సమీపంలోని వరుణ్ డాబా వద్ద బస్సు ఆపారు. బస్సులో నుంచి దిగిన తెలంగాణ రాష్ట్రం సంగారెడ్డి జిల్లా, సాయినగర్‌కి చెందిన మురళీధర్‌రావు భార్య సంధ్యారాణి వాష్‌రూమ్‌ను వినియోగించుకునేందుకు డాబా ప్రాంగణంలోనే ఉన్న బాత్‌రూమ్ వద్దకు వెళ్లింది. అదే సమయంలో గుర్తు తెలియని దుండగుడు డాబా గోడ దూకి, బాత్‌రూమ్ వద్దకు చేరుకుని సంధ్యారాణి మెడలోని సుమారు 4 తులాలు బంగారు గొలుసు హఠాత్తుగా అపహరించి, పరుగులు తీశాడు. వెంటనే బాధితురాలు కేకలు వేసి తోటి ప్రయాణికులను పిలిచింది. అప్పటికే దుండగుడు కనిపించకుండా పారిపోయాడు. సమాచారం అందుకున్న సీఐ సుదర్శన్ ప్రసాద్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ మేరకు సీఐ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
పరిశోధనలకు
అవకాశాలు కల్పించాలి
నారాయణవనం: ఇంజినీరింగ్ విద్యార్థులు పరిశోధనలు చేసుకోవడానికి సరైన వసతులను కల్పిస్తే పరిశోధనలు చేసే అవకాశం కలుగుతుందని తిరుపతి రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్(ఆర్‌టీఐహెచ్) సీఈఓ విజయవంత్ మాథూర్ పేర్కొన్నారు. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా మంగళవారం 16వ నేషనల్ లెవెల్ టెక్నిరల్ సింపోజియం సిద్ధార్థ క్వెస్ట్–2కే26ను నిర్వహించారు. క్వెస్ట్‌లో వివిధ కళాశాలల నుంచి 575 పేపర్ ప్రెజెంటేషన్లు నమోదు కాగా 10 బ్రాంచీల నుంచి 510 పేపర్లు ప్రజెంటేషన్లను ఎంపిక చేశారు. పరిశోధనల పరస్పర సహకారానికి రతన్ టాటా ఇన్నోవేటివ్ హబ్, సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలు ఎంఓయూ కుదుర్చుకున్నాయి. విజరయ్‌వంత్ మాథూర్ మాట్లాడుతూ తమ సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవడానికి ఇంజినీరింగ్ విద్యార్థులకు సరైన ప్లాట్‌ఫామ్‌ను కల్పించాల్సిన బాధ్యత కళాశాలలపై ఉందని అన్నారు. ఈ కార్యక్రమాల్లో సునీల్‌కుమార్ (ఐఐటీ, తిరుపతి), సాంబయ్య (జేఎన్‌టీయూ), ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు తదితరులు పాల్గొన్నారు.
బంగారం చోరీ
రేణిగుంట: పట్టణంలోని బుగ్గవీధిలో నివాసమున్న బి.కల్పన ఇంట్లో 47 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ జరిగినట్లు బాధి తురాలు రేణిగుంట అ ర్బన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పో లీసుల కథనం మేరకు.. బుగ్గవీధికి చెందిన బి.కల్పన (49) 2 తేదీ ఉదయం సుమారు 7.30 గంటలకు ఆమె ఇంటికి తాళం వేసి కూలి పనులకు వెళ్లింది. అదే రోజు రాత్రి సుమారు 8 గంటలకు ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపు తాళం తీసి ఉండడంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించింది. ఇంట్లోని బీ రువా తెరిచి ఉండడం, అందులోని వస్తువులు చిందవందరగా పడి ఉండడంతో దాన్ని పరిశీలించగా అందులో ఉన్న బంగారు గాజులు రెండు జతలు, బంగారు చైను, బంగారు ఉంగరం మొత్తం సుమారు 47 గ్రాముల బంగారు ఆభరణాలు కనిపించలేదు. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి
ఆర్టీసీ బస్సు కింద పడి వ్యక్తి మృతి


