సివిల్స్‌చాందిని | - | Sakshi
Sakshi News home page

సివిల్స్‌చాందిని

Feb 4 2026 8:27 AM | Updated on Feb 4 2026 8:27 AM

సివిల్స్‌చాందిని

సివిల్స్‌చాందిని

తిరుపతి సిటీ: టీటీడీలో రిసెప్షన్‌–1 డిప్యూటీ ఈఓగా పనిచేస్తున్న బయ్యాల భాస్కర్‌ కుమార్తె చాందిని శుక్రవారం రాత్రి విడుదలైన గ్రూప్‌–1 ఫలితాల్లో డీఎస్పీ కొలువు సాధించింది. తిరుపతిలో ప్రాథమిక విద్య పూర్తి చేసిన ఆమె బీటెక్‌ చైన్నెలోని ఓ ప్రముఖ కళాశాలలో పూర్తి చేసింది. అనంతరం ఢిల్లీలోని ఓ కోచింగ్‌ సెంటర్‌లో రెండేళ్ల పాటు పోటీ పరీక్షలకు కోచింగ్‌ తీసుకుంది. సివిల్‌ సర్వీస్‌ లక్ష్యంగా పెట్టుకున్న ఆమె గ్రూప్‌–1, గ్రూప్‌–2 వంటి పోటీ పరీక్షలకు సైతం హాజరవుతూ వచ్చింది. వారం రోజుల వ్యవధిలోనే మూడు రకాల ప్రభుత్వ ఉన్నత స్థాయి ఉద్యోగాలు సాధించింది. ఇందులో ఇటీవల విడుదలైన గ్రూప్‌–2లో ఇంటర్మీడియట్‌ విద్యామండలిలో అధికారి ఉద్యోగానికి ఎంపికయ్యారు. అలాగే జుడీషియల్‌ డిపార్ట్‌మెంట్‌లో సైతం ఉన్నత స్థాయి ఉద్యోగానికి ఎంపికై బుధవారమే విధుల్లో చేరింది. ఇంతలోపే గ్రూప్‌–1 ఫలితాలు విడుదలైన నేపథ్యంలో డీఎస్పీ ఉద్యోగాన్ని సాధించింది. పోటీ పరీక్ష ఏదైనా తానున్నానంటూ సత్తా చాటి జిల్లా వాసులు ప్రశంసలందుకుంటోంది. తన లక్ష్యం ఐఏఎస్‌ సాధించడమేనని డీఎస్పీగా ఉద్యోగంలో చేరి సివిల్స్‌ కోసం మరింత కష్టపడతానని మొక్కవోని ఆత్మవిశ్వాసంతో చెబుతున్న చాందినికి బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ చెప్పాలిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement