గ్రూపు–1లో శ్రీతేజస్విని
సైదాపురం:గూడూరు మండలానికి చెందిన మూడి శ్రీ తేజస్విని ఏపీపీఎస్సీ గ్రూపు–1 ఫలితాల్లో ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. గూడూరు మండలం కంద లికి చెందిన శ్రీతేజస్విని తమ స్వగ్రామంలోనే ప్రాథమిక విద్యను పూర్తి చేశారు. ఆరో తరగతి నుంచి కృష్ణా పురంలోని నవోదయ విద్యాలయంలో హైస్కూలు వి ద్యను పూర్తి చేశారు. తాడేపల్లి గూడెంలో బీటెక్ పూర్తి చేశారు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా ఏపీపీఎస్సీ గ్రూపు–1లో ఫలితాల్లో ఎంపీడీఓ పోస్టుకు ఎంపికయ్యారు. గ్రూపు–1లో శ్రీతేజశ్విని విజయం సాధించడంతో ఆ గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది.


