దోపిడీ నిజం
ఇసుక ఉచితం..
ట్రాక్టర్‌కు ఇసుక లోడ్ చేస్తున్న హిటాచీ
నాగలాపురం: మండలంలోని అరుణానదిలో టీడీపీ నేతలు ఇసుక దోపిడీ చేస్తున్నారు. అక్కడ అధికారిక ఇసుక రీచ్ లేనప్పటికీ ఉచితం ముసుగులో తెలుగు తమ్ముళ్లు అనధికారిక దోపిడీకి తెగబడుతున్నారు. బయటకొడియంబేడు సమీపంలోని అయ్యప్పనాయుడు కండ్రిగ వద్ద నుంచి రెండు రోజులుగా వందలాది ట్రాక్టర్ల ఇసుక అక్రమంగా తరలిపోతోంది. అది కుడా కూతవేటు దూరంలోని సరిహద్దు దాటిస్తేస్తున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తిన చందంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రధానంగా నాగలాపురం మండలానికి తమిళనాడు సరిహద్దు ప్రాంతం అతి తక్కువ దూరంలో ఉండడంతో ఇదే అదునుగా భావించిన అధికార పార్టీ నాయకులు కిందిస్థాయి నుంచి పైస్థాయి వరకు మండలాన్ని ఎంచుకుని ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. తమిళనాడులో ఇసుకకు గిరాకీ ఉండడంతో భారీగా తరలిస్తుస్తూ రూ.కోట్లు గడిస్తున్నారు.
ఇసుక తోడుతున్న జేసీబీలు
ఇసుక తవ్వడంతో ఏర్పడిన గోతులు
ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు
తిరుపతి జిల్లాలో ఉచిత ఇసుక వ్యాపారుల దోపిడీకి వారధిగా మారింది. సత్యవేడు నియోజకవర్గంలో ఇసుక రీచ్‌లు లేనప్పటికీ ఇక్కడి పచ్చ నేతలు ఇసుకను కూతవేటు దూరంలోని తమిళనాడుకు తరలించి కాసుల పంట పండిస్తున్నారు. జిల్లాలో అధిక సంఖ్యలో ఇసుక రీచ్‌లు మూతపడడం, అక్రమ తరలింపుతో సామాన్యుడికి ఇసుక కొరత ఏర్పడుతోంది. ప్రభుత్వం ఖజనాకు వచ్చే ఆదాయాన్ని వదులకుని పేదలకు ఇసుక ఉచితంగా ఇవ్వాలన్న లక్ష్యాన్ని టీడీపీ నేతలే తూట్లు పొడుస్తున్నారు.
దోపిడీ నిజం
దోపిడీ నిజం
దోపిడీ నిజం
దోపిడీ నిజం
దోపిడీ నిజం


