ఉగాదికి టిడ్కో ఇళ్ల అప్పగింత | - | Sakshi
Sakshi News home page

ఉగాదికి టిడ్కో ఇళ్ల అప్పగింత

Feb 6 2026 7:24 AM | Updated on Feb 6 2026 7:24 AM

ఉగాదికి టిడ్కో ఇళ్ల అప్పగింత

ఉగాదికి టిడ్కో ఇళ్ల అప్పగింత

నాయుడుపేట టౌన్‌: రాష్ట్రంలో ఉగాది నాటికి లక్షకు పైగా టిడ్కో గృహాలను లబ్ధిదారులకు అందించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టినట్లు టిడ్కో గృహాల శాఖ ఎండీ సునీల్‌కుమార్‌రెడ్డి వెల్లడించారు. పట్టణంలోని బిరదవాడ సమీపంలో ఉన్న టిడ్కో గృహాల సముదాయాలను గురువారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. టిడ్కో గృహాల వద్ద జరుగుతున్న నిర్మాణ పనులను సైతం అడిగి తెలుసుకున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉగాది నాటికి టిడ్కో గృహాల వద్ద అభివృద్ధి పనులు పూర్తి చేసి, మౌలిక వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించేలా చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. టీడ్కీ గృహాల శాఖ ఎస్‌ఈ మహేష్‌, సీఈ మరియన్‌, మున్సిపల్‌ కమిషనర్‌ షేక్‌ ఫజులుల్లా, మెప్మా సీఎంఎం సురేంద్ర, డీసీఓ ముషీర్‌ అహ్మద్‌, సీఎల్‌టీసీ మునీర్‌ తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement