శివ శివా..క్షమించవా? | - | Sakshi
Sakshi News home page

శివ శివా..క్షమించవా?

Feb 3 2026 7:57 AM | Updated on Feb 3 2026 7:57 AM

శివ శ

శివ శివా..క్షమించవా?

వరుసగా దొర్లుతున్న అపశ్రుతులు

ఆందోళనలో భక్తులు

అధికారులు మేల్కొనేనా?

సాక్షి,టాస్క్‌ఫోర్స్‌: శ్రీకాళహస్తీశ్వరాలయంలో మ హాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మరో వారం రోజు ల్లో ప్రారంభం కానున్నాయి. ఈనెల 10 నుంచి 23వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరందుకున్నాయి. కానీ ఈ తరుణంలో వరుసగా అపశ్రుతులు చోటుచేసుకుంటున్నాయి. ఒకింత భక్తుల్లో అలజడిని సృష్టిస్తున్నాయి. అధికారుల అవగాహన రాహిత్యం.. నిర్లక్ష్యమే కారణమనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

త్రిశూల స్నానం..భయం..భయం!

శ్రీకాళహస్తీశ్వరాలయం వద్ద ఆదివారం త్రిశూల స్నాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమం చివరిలో భక్తులు వెళుతున్న సమయంలో అనుకోని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ ఏర్పా టు చేసిన ఐరన్‌ ఫెన్సింగ్‌కు కరెంట్‌ సరఫరా రావడంతో వందల మంది భక్తులు షాక్‌కు గురయ్యా రు. వెంటనే ఓ ఎలక్ట్రీషియన్‌ మేల్కొనడంతో పె నుప్రమాదం తప్పింది. ఈ ఘటనలో సుమా రు వంద మంది భక్తులకు స్వల్పంగా కరెంట్‌ షాక్‌ కొట్టినట్టు సమాచారం. ఈ ఘటనపై ఆల య అధికారులు ఏమీ జరగనట్టు అక్కడి నుంచి వెళ్లిపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. ‘కొంచెం ఆలస్యమైతే వందల మంది ప్రాణాలు పో యేవి. అప్పుడు బాధ్యత ఎవరిది?’ అంటూ మహిళా భక్తులు ఆగ్రహం వ్యక్తం చేయడం కనిపించింది.

ఫొటోలకు ఫోజులు..సంప్రోక్షణలు

త్రిశూల స్నానం సందర్భంగా అధికారులు, కొందరు పాలక మండలి సభ్యులు ఫొటోలకు ఫోజులివ్వడంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా ఓ ముఖ్య అధికారి, మరొకరు త్రిశూలాన్ని చేత్తో స్పృచించిన్నట్టు తెలుస్తోంది. దీన్ని చూసిన అక్కడి అర్చకులు అవాక్కయ్యారు. త్రిశూల స్నానం అనంతరం ఆలయం అంతటా సంప్రోక్షణ చేపట్టారు.

చూసుకోవాలిగా..!

త్రిశూల స్నానం అనంతరం స్వామి, అమ్మవార్లు గ్రామోత్సవానికి బయల్దేరారు. అదే సందర్భంలో ఓ మృతదేహం ఎదురుగా రావడంతో వాహనాలను అక్కడే ఆపేశారు. కానీ ఈ విషయాన్ని అధికారులు, సిబ్బంది ముందుగానే పసిగట్టలేకపోయారు. ఇక చేసేది లేక పట్టణ మాడ వీధులు.. స్వామి, అమ్మవార్ల గర్భాలయాల్లో సంప్రోక్షణ చేపట్టారు. మహాశివరాత్రి ముందు ఇలా వరుస ఘటనలు చోటుచేసుకోవడం ఒకింత భక్తుల్లో ఆందోళనకు గురిచేస్తోంది. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా, ఆలయాధికారులు, పాలక మండలి పకడ్బందీ చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

మరో వారం రోజుల్లో

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు

శివ శివా..క్షమించవా?1
1/1

శివ శివా..క్షమించవా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement