ఓవరాల్‌ చాంపియన్స్‌గా ఎన్‌ఎస్‌యూ | - | Sakshi
Sakshi News home page

ఓవరాల్‌ చాంపియన్స్‌గా ఎన్‌ఎస్‌యూ

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

ఓవరాల

ఓవరాల్‌ చాంపియన్స్‌గా ఎన్‌ఎస్‌యూ

తిరుపతి సిటీ: జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో నాలుగు రోజులగా జరిగిన నేషనల్‌ సాంస్క్రిట్‌ స్టూడెంట్స్‌ కల్చరల్‌ ఫెస్ట్‌–2026 ఘనంగా ముగిసింది. బుధవారం వర్సిటీలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్వీయూ రెక్టార్‌ ప్రొఫెసర్‌ అప్పారావు విచ్చేసి మాట్లాడుతూ కళలు విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసే సాధనాలని, ప్రతి విద్యార్థి తనలో టాలెంట్‌ గుర్తించి దాన్ని అనుసరించి ముందుకు సాగాలని సూచించారు. అనంతరం వీసీ జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, అతిథులతో కలసి యూత్‌ ఫెస్ట్‌లో ఓవరాల్‌ చాంపియన్స్‌గా నిలిచిన తిరుపతి జాతీయ సంస్కృత వర్సిటీ విద్యార్థులకు ట్రోఫీ, బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ లీనా చంద్ర, డాక్టర్‌ ధర్మదాసన్‌ సితార పాల్గొన్నారు

రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి

డక్కిలి: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలని డీఎంహెచ్‌ఓ బాలకృష్ణ నాయక్‌ తెలిపారు. డక్కిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని బుధవారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రికి వచ్చే రోగులకు సకాలంలో మెరుగైన వైద్యసేవలు అందేలా సిబ్బంది పని చేయాలని సూచించారు. పీహెచ్‌సీకి రోజుకు ఎంత మంది రోగులు వస్తున్నారన్న వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజు సిబ్బంది హాజరు ఎఫ్‌ఆర్‌ఎస్‌ యాప్‌లోనే మూడు సార్లు తప్పకుండా వేయాలన్నారు. రోగులు వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలన్నారు. వైద్యులు బిందు ప్రియాంక, శ్రీహరి పాల్గొన్నారు.

ఎంబీయూలో ప్లేస్‌మెంట్స్‌లో విద్యార్థుల ప్రతిభ

చంద్రగిరి: మోహన్‌బాబు విశ్వవిద్యాలయంలో బుధవారం నిర్వహించిన ప్లేస్‌మెంట్‌లో విద్యార్థులు ఉత్తమ ప్రతిభను చాటారని విశ్వవిద్యాలయం అధికారులు తెలిపారు. బుధవారం ప్రతిష్టాత్మకమైన ఇన్ఫోసిస్‌, ఎల్‌టీఐ–మైండ్‌ ట్రీ సంస్థలు ప్లేస్‌మెంట్‌ కోసం ఇంటర్వ్యూలను నిర్వహించాయి. ఈ సందర్భంగా కళాశాలకు చెందిన 415 మంది విద్యార్థులు గరిష్టంగా ఏడాదికి రూ.21లక్షల వేతనాలతో కొలువు సాధించినట్లు తెలిపారు. 2025–26 విద్యాసంవత్సరంలో క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లో ముఖ్యమైన మైలురాయిని సాధించినట్లు ఎంబీయూ ఓ ప్రకటనలో తెలిపింది. 415 మంది విద్యార్థులు బహుళజాతి సంస్థలైన ఇన్ఫోసిస్‌, ఎల్‌టీఐ–మైండ్‌ ట్రీ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు రావడం ఆనందంగా ఉందని ఆ వర్సిటీ అధికారులు తెలిపారు. విద్యార్థులకు ఎంబీయూ చాన్సలర్‌ మోహన్‌బాబు, ప్రో చాన్సలర్‌ మంచు విష్ణు అభినందనలు తెలిపారు.

ఓవరాల్‌ చాంపియన్స్‌గా ఎన్‌ఎస్‌యూ 
1
1/2

ఓవరాల్‌ చాంపియన్స్‌గా ఎన్‌ఎస్‌యూ

ఓవరాల్‌ చాంపియన్స్‌గా ఎన్‌ఎస్‌యూ 
2
2/2

ఓవరాల్‌ చాంపియన్స్‌గా ఎన్‌ఎస్‌యూ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement