అవకతవకలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
తిరుపతి అర్బన్: గృహ నిర్మాణాలకు సంబంధించి ఆప్షన్ త్రీలో డీవియేషన్, రెక్టిఫైకేషన్(అవకతవకలు)పాల్పడిన కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కలెక్టర్ వెంకటేశ్వర్ ఆదేశించారు. గురువారం ఆయన కలెక్టరేట్‌లో గృహనిర్మాణశాఖకు చెందిన అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనిర్మాణాల సమయంలో బేస్‌మెంట్‌కు మట్టి పోయకుండా, బేసిమెంట్ వేయకుండా కొందరు బిల్లులు చేసుకున్న వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావును ఆదేశించారు. అలాగే ప్రధానమంత్రి అవాస్ యోజన స్కీమ్ ద్వారా 1,608 గృహాలను ఉగాదికి పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఇంటి నిర్మాణాల్లో తప్పకుండా నాణ్యతా ప్రమాణాలు పాటించాలని చెప్పారు. అలాగే గడువులోపు ఇంటి నిర్మాణాలు పూర్తి చేయాలని తెలిపారు.


