డైకిన్‌–రెచీ ఇండియా నూతన పరిశ్రమకు భూమిపూజ | - | Sakshi
Sakshi News home page

డైకిన్‌–రెచీ ఇండియా నూతన పరిశ్రమకు భూమిపూజ

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

డైకిన్‌–రెచీ ఇండియా నూతన పరిశ్రమకు భూమిపూజ

డైకిన్‌–రెచీ ఇండియా నూతన పరిశ్రమకు భూమిపూజ

● 547కోట్ల పెట్టుబడి.. 500 మందికి ఉపాధి అవకాశాలు

శ్రీసిటీ(సత్యవేడు): శ్రీసిటీలో డైకిన్‌ –రెచీ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ నూతన పరిశ్రమ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేశారు. జపాన్‌కు చెందిన డైకిన్‌ ఇండస్ట్రీస్‌ లిమిటెడ్‌ అనుబంధ సంస్థ డైకిన్‌ ఎయిర్‌ కండిషనింగ్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌, తైవాన్‌కు చెందిన రెచీ ప్రెసిషన్‌ కంపెనీ లిమిటెడ్‌ సంయుక్తంగా భాగస్వామ్యంతో ఏర్పాటవుతున్న డైకినీ–రెచీ కంపెనీలో ఏసీల విడిభాగాలు (రోటరీ కంప్రెసర్లు) ఉత్పత్తి చేస్తారు. నూతన ప్లాంట్‌ భూమిపూజ కార్యక్రమంలో డైకిన్‌ ఇండియా చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ కన్వల్‌ జీత్‌ జావా, డైకిన్‌–రెచీ ఇండియా డైరెక్టర్‌ సెకిదా నయోటో సహా పలువురు పరిశ్రమ ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జావా మాట్లాడుతూ ప్రధాని ‘మేక్‌ ఇచ్‌ ఇండియా ఫర్‌ వరల్డ్‌’ లక్ష్యానికి అనుగుణంగా డైకిన్‌లో కలైజేషన్‌ ప్రయాణంలో ఇదిఒక కీలక మైలురాయిగా నిలుస్తుందన్నారు. ఈ సదుపాయం హెచ్‌వీఏసీ తయారీ వ్యవస్థను బలోపేతం చేస్తూ, దేశీయ గ్లోబల్‌ మార్కెట్లకు సేవలందిస్తుందన్నారు. ప్లాంట్‌ ఏర్పాటును స్వాగతించిన డాక్టర్‌ రవీంద్రసన్నారెడ్డి, ఈ పెట్టుబడి ఆంధ్రప్రదేశ్‌లో సులభతర, వేగవంతమైన వ్యాపార వ్యవస్థపై ప్రభుత్వం నిబద్ధతను చాటుతుందన్నారు. 33.10 ఎకరాల్లో విస్తరించే ఈ ప్రాజెక్టు మూడు దశల్లో అభివృద్ధి చేస్తారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement