శ్రీవారి సేవలో ఇండియన్ క్రికెట్ ఫీల్డింగ్ కోచ్
తిరుమల: న్యూజిలాండ్ టీ20 సిరీస్‌లో ఘన వి జయం సాధించిన అనంతరం టీమ్ ఇండియా ఫీ ల్డింగ్ కోచ్ దిలీప్ సోమ వారం వేంకటేశ్వర స్వా మివారిని దర్శించుకున్నా రు. శ్రీవారి దర్శనం అనంతరం దిలీప్ మీడియాతో మాట్లాడుతూ శ్రీవారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.
రెండు రోజుల్లో ఫీజులు తగ్గిస్తాం
తిరుపతి సిటీ: ఎస్వీయూలో బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్ష ఫీజులు తగ్గించాలని కోరుతూ సోమ వారం వీసీ చాంబర్ ఎదుట ఎస్‌ఎఫ్‌ఐ నాయకు లు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. అనంతరం రెక్టార్ అప్పారావును కలిసి వినతిపత్రం అందజేశారు. బీఈడీ ఫీజుల విషయంలో ఈసీ సమావేశంలో చర్చించి, రెండు రోజుల్లో తగ్గించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో విద్యార్థులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు.


