ఐఐటీలో ఏఐ ఫర్‌ సోషల్‌ గుడ్‌ హ్యాకథాన్‌ | - | Sakshi
Sakshi News home page

ఐఐటీలో ఏఐ ఫర్‌ సోషల్‌ గుడ్‌ హ్యాకథాన్‌

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

ఐఐటీలో ఏఐ ఫర్‌ సోషల్‌ గుడ్‌ హ్యాకథాన్‌

ఐఐటీలో ఏఐ ఫర్‌ సోషల్‌ గుడ్‌ హ్యాకథాన్‌

ఏర్పేడు: న్యూఢిల్లీలో ఫిబ్రవరి 19, 20 తేదీల్లో జరగనున్న ఇండియా–ఏఐ ఇంపాక్ట్‌ సమ్మిట్‌– 2026నకు అధికారిక ప్రీ–సమ్మిట్‌ ఈవెంట్‌ అయిన ‘ఏఐ ఫర్‌ సోషల్‌ గుడ్‌ హ్యాకథాన్‌’ కార్యక్రమం సోమవారం ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో జరిగింది. ఐఐటీ డైరెక్టర్‌ డాక్టర్‌ కేఎన్‌ సత్యనారాయణ ఆధ్యక్షతన జరిగిన ఈ ప్రీ– ఈవెంట్‌లో చట్టపరమైన అవగాహ న,వినియోగదారుల రక్షణ, గోప్యతను కాపాడే మోసా ల నివారణ, పర్యావరణ స్థిరత్వం, డేటా గోప్యతా సాధనాలు, ఏఐ అక్షరాస్యత వంటి సామాజిక సవాళ్లను పరిష్కరించే దృక్పథాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సుమారు 60 మంది విద్యార్థులు పరిష్కార మార్గాలను వివిధ కోణాల్లో ప్రదర్శించారు. తిరుపతి ఐఐటీ అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చిమలకొండ, రిషా ల్యాబ్‌ (ఇంటెలిజెంట్‌ సాఫ్ట్‌వేర్‌ – హ్యూమన్‌ అనలిటిక్స్‌లో పరిశోధన), డీన్‌ (కాంపిటెన్సీ, డెవలప్‌మెంట్‌, ఔట్‌రీచ్‌) కార్యాలయం ప్రొఫెసర్‌ అరుణ్‌ కె తంగిరాల పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement