సెమీ కండక్టర్ల హబ్‌గా భారత్
నారాయణవనం: రాబోవు రోజుల్లో భారత దేశం సెమీ కండక్టర్లకు, క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా మారబోతోందని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాసవర్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ సెమీ కండక్టర్ల అభివృద్ధికి రూ.40 వేల కోట్లు బడ్జెట్‌లో కేటాయింపు జరిగిందని చెప్పారు. క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు కేంద్రం రూ.9 వేల కోట్లను కేటాయించిందని తెలిపారు. డీఆర్‌డీఓ శాస్త్రవేత్త రామమూర్తి మాట్లాడుతూ ఆలోచనే ఇంజినీర్లకు గుర్తింపు తీసుకువస్తుందన్నారు. సాయంత్రం జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలకు సినీనటి నిథి అగర్‌వాల్ హాజరై సందడి చేసింది. ఈ కార్యక్రమాలలో కళాశాలల చైర్మన్ అశోకరాజు, వైఎస్ చైర్మన్ ఇందిరవాణి, ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు.


