సాంకేతిక పరిశోధనలతో గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిశోధనలతో గుర్తింపు

Jan 31 2026 10:25 AM | Updated on Jan 31 2026 10:25 AM

సాంకేతిక పరిశోధనలతో గుర్తింపు

సాంకేతిక పరిశోధనలతో గుర్తింపు

నారాయణవనం: నడుస్తున్న టెక్నాల జీ యుగంలో సాంకేతిక పరిశోధనల తో మంచి గుర్తింపును, అవకాశాలను అందుకోవచ్చని పలువురు పరిశోధన నిపుణులు పేర్కొన్నారు. సిద్ధార్థ ఇంజినీరింగ్‌ కళాశాలల సిల్వర్‌ జూబిలీ వా ర్షికోత్సవాల్లో శుక్రవారం వర్క్‌షాప్‌లు, సెమినార్‌లు, నిపుణుల, అతిథుల ఉపన్యాసాలు జరిగాయి. ప్రముఖ టెక్నాలజీ పరిశ్రమలు, అకాడమిక్‌ రంగాల నిపుణులు ఎజిల్‌వన్‌ (చైన్నె), తిరుపతి ఐఐటీ నిపుణులు విఘ్నేష్‌, వెంకటయ్య, కౌటిల్య శ్రీధర్‌, రాజేంద్ర ప్రసాంత్‌ (ఐఐఐటీ శ్రీసిటీ), వైలూరు పెరుమాలు (ఐటీ కన్సల్టెంట్‌ డెలాయిట్‌)లు ఆధునిక సాంకేతికత, పరిశ్రమ అవసరాలు, తదితర అంశాలపై చర్చించారు. కార్యక్రమాలు పరిశ్రమ–విద్యా రంగాల మధ్య అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయని కళాశాలల చైర్మన్‌ డాక్టర్‌ అశోకరాజు పేర్కొన్నారు.

ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగల అరెస్టు

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు అంతర్రాష్ట్ర దొంగలను తిరుమల టూ టౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి దొంగిలించిన నగదు, మొబైల్‌ ఫోను స్వాధీనం చేసుకున్నారు. తిరుమల టూ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన కేసుకు సంబంధించి గురువారం తిరుమలలోని కారు పార్కింగ్‌ ప్రాంతంలో అనుమానితులు తెలంగాణ రాష్ట్రం జనగామ జిల్లాకు చెందిన కొండ బాలకృష్ణ అలియాస్‌ రమేష్‌ (35), అదే రాష్ట్రం హనుమకొండ జిల్లాకు చెందిన మండ నవీన్‌ (32)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు భక్తుల రద్దీని గమనించి అమాయక భక్తులను లక్ష్యంగా చేసుకుని ముందుగా పరిచయం పెంచుకుని, భక్తులు స్నానానికి వెళ్లిన సమయంలో వారి లగేజ్‌ బ్యాగులను చోరీస్తున్నట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుంచి మొబైల్‌ ఫోను, రూ.45 నగదు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement