సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ
రేణిగుంట: స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులపై ఇటీవల వచ్చిన అవినీతి ఆరోపణలు, వివాదాల నేపథ్యంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ రేణిగుంట సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ, సేవల వేగం, ప్రజలకు అందుతున్న సౌకర్యాలపై కలెక్టర్ ఆరా తీశా రు. చాలా మంది సేవలపై సంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ, మార్కెట్ విలువ ధ్రువపత్రాలు, భార రహి త ధ్రువపత్రాలు జారీ విషయంలో ఆలస్యం అవుతున్నట్లు కొందరు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన జిల్లా కలెక్టర్ సబ్ రిజిస్ట్రార్ బాలాజీ, సి బ్బందికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కార్యాలయంలో అనధికార వ్యక్తులు ఉండడం గమనించిన ఇలా ఉంటే తీవ్రమైన పరిణామాలు ఉంటా యని హెచ్చరించారు.


