రిజిస్ట్రేషన్.. ఇక ప్రియం
– 8లో
– 8లో
న్యూస్‌రీల్
బాబు సర్కారు మరోసారి స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్ చార్జీలను భారీగా పెంచి, ప్రజల నడ్డివిరవనుంది.
చాంపియన్స్‌గా విశాఖ, కృష్ణా
ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ఓవరాల్ చాంపియన్లుగా విశాఖ, కృష్టా జిల్లా ల జట్లు నిలిచాయి.
ముడుపు చెల్లిస్తేనే.. మ్యుటేషన్
శనివారం శ్రీ 31 శ్రీ జనవరి శ్రీ 2026
మ్యుటేషన్ చేసుకోవడానికి జిల్లాలో సాగుతున్న రెవెన్యూ బేరాలు తెలిసిందే. కొన్నిచోట్ల బాహాటంగానే కొందరు పైసలిస్తేనే ఫైల్ ముందుకు సాగుతుందని చెప్పేస్తున్నారు. మరికొందరు అధికార పార్టీ నేతల అధికారులకు సిఫారసు చేయించి మ్యుటేషన్ చేయిస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారు. అయితే పాలకపక్షానికి చెందిన చోటా నేతలు తమకు పెద్ద మొత్తంలో ఇచ్చుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో రెవెన్యూ అధికారులకు మించి అధికార పార్టీ చోటా నేతలు డిమాండ్ చేయడంతో... మళ్లీ అధికారుల వద్దకే క్యూ కడుతున్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు జిల్లా వ్యాప్తంగా డైబ్భె వేల మంది మ్యుటేషన్ దరఖాస్తులు చేసుకున్నట్లు స్పష్టం అవుతుంది. 15 నుంచి 20 శాతానికి మించి పరిష్కారం చేసిన దాఖలాలు లేవు. ప్రధానంగా 75శాతం దరఖాస్తులను డాక్యుమెంట్స్ సక్రమంగా లేవంటూ రిజెక్ట్ కొట్టినట్లు తెలుస్తోంది.
30 రోజుల వ్యవధి
సాధారణంగా మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో వాటిని పూర్తి చేయాల్సి ఉంది. మ్యుటేషన్‌కు దరఖాస్తు చేసుకున్న 15 రోజుల తర్వాతే ఫైల్ వీఆర్‌ఓకు వెళుతుంది. ఆ తర్వాత రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌కు, అనంతరం తహశీల్దార్‌కు ఫైల్ చేరుతుంది. అయితే 28 లేదా 29 రోజుల సమయంలో నగదు బేరాలు కుదిరితే ఓకే చేస్తున్నారు. లేదంటే డాక్యుమెంట్స్ పెండింగ్ అంటూ ఓ సాకుగా చూపించి రిజెక్ట్ కొట్టేస్తున్నారు. అందులో వారసత్వ ఆస్తులకు చెందిన మ్యుటేషన్లు సైతం ఇలానే సాగుతున్నాయి. దీంతో సచివాలయ పరిధిలోని వీఆర్‌ఓల నుంచి జిల్లా కలెక్టర్ వరకు మ్యుటేషన్ దరఖాస్తులు తిరుగుతూనే ఉండడం చర్చనీయాంశంగా మారింది. ఓజిలి మండలంలో ఓ వీఆర్‌ఓ, ఓ తహశీల్దార్, రామచంద్రాపురం మండలంలో ఓ వీఆర్‌ఓను అర్జీల పరిష్కారం అంశంలో తప్పుడు నివేదికలు ఇచ్చారని తేలడంతో ఇటీవల సస్పెండ్ చేశారు. అయితే అధికారుల్లో మాత్రం మార్పురావడం లేదు.
తడ: కొందరు వీఆర్‌ఓలు స్థానికులు కావడం, ఏళ్ల తరబడి ఇక్కడే కొలువులు చేస్తూ ఉండడంతో ఎవరి వద్ద ఎంత దండుకోవచ్చు అనే వివరాలపై పూర్తి అవగాహన ఉంది. దీంతో ఇక్కడి అధికారులు తమ చేతివాటం నిరాటంకంగా సాగిస్తున్నారు. మండలంలో రెండు సంవత్సరాల కాలంలో మొత్తం 2,419 సర్వే నంబర్లు మ్యుటేషన్‌కి రాగా అందులో 1,922 నంబర్లు పరిష్కారం అయ్యాయి. మరో 432 తిరస్కరించబడగా మిగిలినవి పెండింగ్‌లో ఉన్నాయి.
రెవెన్యూ కార్యాలయం వద్ద చెట్ల కిందే నిరీక్షిస్తున్న రైతులు
మ్యుటేషన్ కోసం రైతు ఒక ఎకరాకు వీఆర్‌ఓకు రూ.వెయ్యి నుంచి రూ.3 వేల వరకు అందించాలి. లేదంటే అక్కడు పలు రకాల తిరకాసులుంటాయి. వెంటనే ఆ ఫైలు ఆర్‌ఐ వద్దకు చేరుతుంది ఆయనకు రూ.వెయ్యి నుంచి రూ.3వేల వరకు అందించాలి.అక్కడి నుంచి డీటీతోపాటు తహశీల్దార్ వద్దకు ఫైలు వస్తుంది. అక్కడ ఆ అధికారి చెప్పినంత ఇ వ్వాల్సిందే. లేదంటే ఆ ఫైలు అప్పడే తిరస్కారానికి గురవుతుంది. ఇలా ప్రతి ఒక్క అధికారికి ముట్టజెబితేనే పని అవుతుంది. లేదంటే ఫైలు రిజెక్ట్ అవుతుంది.
చంద్రగిరి నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ముడుపులు ఇస్తే తప్ప ముటేషన్లు జరగడం లేదన్న విమర్శలున్నాయి. ఇటీవ ల రామచంద్రాపురం మండలం పీవీపురం గ్రామ రెవెన్యూ అధికారిపై కలెక్టర్ సస్పెన్షన్ వేటు వేయడంతో అప్రమత్తమైన రెవెన్యూ అధికారులు ఇచ్చినంత తీసుకుని గుట్టుగా ముటేషన్లను పూర్తి చేస్తున్నట్టు సమాచారం. పాకాల మండలంలో మ్యుటేషన్లు ఏవీ పెండింగ్ లేవని తహశీల్దారు చెప్పగా చిన్నగొట్టిగల్లు మండలంలో ఆరు మ్యుటేషన్లు పెండింగ్‌లో ఉన్నప్పటికీ అవన్నీ కోర్టులో న్నందున అక్కడి తహశీల్దార్ నిలుపుదల చేసినట్టు సమాచారం. రామచంద్రాపురం తహశీల్దార్ కార్యాల యంలో మ్యుటేషన్లకు గుట్టుగా డబ్బులు తీసుకుని సకాలంలో పూర్తి చేస్తున్నట్టు దరఖాస్తుదారులు చెబుతున్నారు. చంద్రగిరి మండలంలో మ్యుటేషన్లు సకాలంలో పూర్తి చేస్తున్నప్పటికీ ఎంతో కొంత ముడుపులు తీసుకుంటున్నట్టు సమాచారం. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని 8 గ్రామ పంచాయతీల పరిధిలో రీసర్వే ప్రక్రియ జరుగుతున్నందున మ్యుటేషన్లు పెద్దగా రావడం లేదు.
జనవరి 1 నుంచి మ్యుటేషన్ నిలుపుదల
ముందే మ్యుటేషన్ దరఖాస్తులు పేరుకుపోయాయి. దానికితోడు జిల్లాల పునర్విభజన, జేసీ అధికారాలను ఇటీవల తహశీల్దార్లుకు, ఆర్డీఓలకు బదిలీ చేసిన నేపథ్యంలో కొద్ది రోజులు మ్యుటేషన్ ప్రక్రియను నిలుపుదల చేయాలని అధికారులకు ఆదేశాలు వచ్చినట్లు స్పష్టం చేస్తున్నారు. దీంతో జనవరి 1 నుంచి పూర్తిగా నిలుపుదల చేశారు. సాధారణంగా వారసత్వ ఆస్తుల బదిలీలు, రిజిస్ట్రేషన్ చేసుకున్న ఆస్తులకు సంబంధించి, అన్ రిజిస్టర్డ్ అంశాలు, సర్వే రిపోర్ట్ లేకపోవడం తదితర సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో మ్యుటేషన్ పెద్ద సమస్యగా మారిపోయింది.
భూముల మ్యుటేషన్ల కోసం రైతులు నానా ఇక్కట్లు పడుతున్నారు. రెవెన్యూ
కార్యాలయాల్లో లంచాలివ్వలేక ఆవేదన చెందుతున్నారు. ఓ వైపు భూముల విస్తీర్ణం, మరోవైపు భూముల రేట్లు ఆధారంగా
కొందరు ఉద్యోగులు పెద్ద మొత్తంలో
డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగులకు
సంతృప్తికరమైన కాసులు ముట్ట చెబితేనే
సమస్యకు పరిష్కారం చూపుతున్నారు.
లేదంటే ఏదో ఒక సాకు చూపి, గడువు తీరినాక రిజెక్ట్ కొట్టేస్తున్నారు. దీంతో పేదలకు చెందిన మ్యుటేషన్లు పెద్ద ఎత్తున పెండింగ్‌లో పడిపోతున్నాయి. కాసులున్నవారు, అధికార పార్టీ నేతలకు మాత్రం అడంగల్, వన్‌బీలలో పేర్లు మార్పు చేస్తూ రెవెన్యూ అధికారులు తమ విధేయతను చాటుకుంటున్నారు.
– తిరుపతి అర్బన్
14 నెలలుగా తిరుగుతున్నాడు
ఈ ఫొటోలో ఉన్న వ్యక్తి పేరు శేసెట్టి విజయ్‌కుమార్. వెంకటగిరి మున్సిపాలిటీలోని బంగారుపేటకు చెందిన వారు. ఈయనకు సంబంధించిన సర్వే నెంబర్ 42–2, 42–5లో 63 సెంట్లు వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాల కోసం 14 నెలలుగా రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. మ్యుటేషన్‌కు చలానా కట్టి సుమారుగా ఏడాది పైన కావస్తోంది. నేటికీ ఆయన పొలానికి సంబంధించి పాసుపుస్తకాలు అందలేదు. ఈ విషయంపై బాధితుడు నిత్యం రెవెన్యూ కార్యాలయం వద్దకు వెళ్లి ప్రాధేయపడినా ఎవ్వరూ సమాధానం కూడా ఇవ్వడం లేదు.
రిజిస్ట్రేషన్.. ఇక ప్రియం
రిజిస్ట్రేషన్.. ఇక ప్రియం
రిజిస్ట్రేషన్.. ఇక ప్రియం


