పులికాట్‌లో పక్షుల గణన
సూళ్లూరుపేట: పులికాట్ సరస్సుకు వచ్చే విదేశీ వలస పక్షుల లెక్కింపును అటవీశాఖాధికారులు, పర్యావరణ నిపుణులు, పక్షి పరిశోధకులు, వలంటీర్లు శుక్రవారం చేపట్టారు. ఈ సరస్సుకు ఎన్ని జాతులు పక్షులు వస్తున్నాయి, ఎన్ని వస్తున్నాయ నే అంశంపై పూర్తిస్థాయిలో అధ్యయనం చేస్తున్నా రు. ఈ సర్వే శని, ఆదివారాల్లో కూడా నిర్వహిస్తా మని కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, జూ క్యూరేటర్ సె ల్వం, పులికాట్ వన్యప్రాణి సంరక్షణ విభాగం డివిజనల్ అధికారి హారిక తెలిపారు. పక్షి జాతుల వైవిధ్యం, వాటి సంఖ్య, గుడ్లు పెట్టి పొదిగి పిల్లలను చేసుకోవడం, వాటి జీవనశైలిపై అధ్యయ నం చేస్తున్నారు. ఈ ఏడాది పక్షులు గణనలో గణనీయంగా కనిపించే ప్రముఖ జాతుల్లో పెలికాన్స్, పెయింటెడ్ స్టార్క్స్, స్పాట్‌బిల్ట్ బాతులు, హెరా న్లు, ఎగ్రెట్స్ ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు వెల్లడించారు. మొత్తంగా తీసుకుంటే 118 రకాలైన పక్షులు 1,99,659 ఉన్నట్టుగా గుర్తించారు.
హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు!
నాయుడుపేట టౌన్ : సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ స్వార్థ రాజకీయ స్వార్థం కోసం తిరుమల లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారం చేయడంతో ప్రపంచంలోని 140 కోట్ల మంది హిందువుల మనోభావాలను దెబ్బతిన్నాయని సూళ్లూరుపేట మాజీ ఎమ్మె ల్యే కిలివేటి సంజీవయ్య అన్నారు. మండలంలోని తిమ్మాజీకండ్రిగలోని అభయానుగ్రహ వేంకటేశ్వరస్వామి ఆలయంలో సంజీవయ్యతోపాటు వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కామిరెడ్డి సత్యనారాయణరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ కటకం దీపిక, వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు తంబిరెడ్డి సుబ్రమణ్యంరెడ్డి, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి కామిరెడ్డి రాజారెడ్డి తదితరులతో కలిసి ఆలయం వద్ద పూజలు చే సి, టీడీపీ, జనసేన నేతలకు కనువిప్పు కల గాలని మొక్కుకున్నారు. అలాగే ఆలయ ప్రాంగణంలో 108 కొబ్బరికాయలు కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా సంజీవయ్య మాట్లాడుతూ శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు కలవలేదని సీబీఐ సు ప్రీం కోర్టుకు ఇచ్చిన నివేదికలో స్పష్టంగా తెలియజేసిందన్నారు. వైఎస్సార్ సీపీ నేత కామిరెడ్డి స త్యనారాయణరెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూ లో కొవ్వు కలిసిందని హిందువుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడిన తీరుపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు.
నాణ్యమైన భోజనం అందించండి
తిరుపతి అర్బన్: బీసీ వసతి గృహాల్లో ఉంటు న్న విద్యార్థులకు నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం ఇవ్వాలని బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ మల్లికార్జున్ వెల్లడించారు. విజయవాడ నుంచి శుక్రవారం తిరుపతికి విచ్చేసిన ఆయన తిరుపతిలోని పలు బీసీ హాస్టళ్లను తనిఖీ చేశా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హస్టల్ విద్యార్థులకు ఓ వైపు చదువుతోపాటు ఆరోగ్య విషయాల్లోను నాణ్యత ప్రమాణాలు పాటించాలని జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారి భరత్‌రెడ్డికి సూచించారు. నిత్యం పిల్లలపై నిఘా పెట్టాలని చెప్పారు.
వైఎస్సార్ సీపీ వివిధ విభాగాల ప్రతినిధులు ఎంపిక
తిరుపతి కల్చరల్: వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు తిరుప తి జిల్లాలో వివిధ విభాగాల రాష్ట్ర, జిల్లా కమిటీ ప్ర తినిధులకు ఎంపిక చేసినట్లు ఆ పార్టీ కేంద్ర కా ర్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొంది. ఇందులో భాగంగా రాష్ట్ర మైనారిటీ సెల్ సహా య కార్యదర్శిగా శ్రీకాళహస్తికి చెందిన షేక్ ఖా దీరుల్లా, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సహాయ కార్యదర్శి గా కంచి గురవయ్య, రాష్ట్ర ఇంటలెక్చువల్ ఫోరం సహాయ కార్యదర్శిగా కె.శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర ఐటీ వింగ్ సహాయ కార్యదర్శిగా పి.అఽశోక్‌రెడ్డి, వైఎస్సార్‌టీయూసీ సహాయ కార్యదర్శిగా సత్యవేడుకు చెందిన బి.సురేష్ నియమితులయ్యారు. అలాగే వైఎస్సార్ సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శులుగా తిరుపతికి చెందిన ఇమ్రాన్‌బాషా, ఖాదర్ బాషా, ఆరణి సంధ్య నియమితులయ్యారు.
హరిత పాఠశాలలకు 8 అవార్డులు
తిరుపతి అర్బన్: ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 8 పాఠశాలలు గ్రీన్ స్కూల్ ప్రోగ్రామ్‌కు ఎంపిక కా వడంతో ఆ స్కూళ్ల హెచ్‌ఎంలు న్యూఢిల్లీలో శుక్రవారం అవార్డులు అందుకున్నారు. వారితోపాటు ఏపీఎన్‌జీసీ జిల్లా సమన్వయకర్త బాలచైతన్యకు అవార్డు దక్కింది. న్యూఢిల్లీలోని ఇండియా హాబిటెట్ సెంటర్లలోని స్టెయిన్ ఆడిటోరియంలో సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ డైరెక్టర్ సునీత అవార్డులను ప్రదానం చేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గంగవరం మండలంలోని పత్తికొండ జెడ్పీ హైస్కూలు, బొమ్మసముద్రం ప్రభు త్వ హైస్కూలు, తరిగొండ జెడ్పీ హైస్కూల్, కరకంబాడి జెడ్పీ హైస్కూలు, వెదురుకుప్పం జెడ్పీ హైస్కూలు, పుత్తూరు బాలికల హైస్కూలు, ఆర్కేఎంపురం హైస్కూలు, చింతలపట్టడ హైస్కూలు కు హరిత అవార్డులు దక్కాయి. ఈ క్రమంలో తిరుపతి, చిత్తూరు జిల్లాల డీఈఓలు కేవీఎన్ కు మార్, రాజేంద్ర ప్రసాద్, సమగ్రశిక్ష ఏపీసీలు గౌ రీశంకర్, వెంకటరమణతోపాటు పలువురు అవా ర్డు అందుకున్న వారిని అభినందించారు.
పులికాట్‌లో పక్షుల గణన


