తిరుపతిలో తిరువళ్లూరు ముద్దాయిలు మకాం
తిరుపతి అర్బన్: తమిళనాడు రాష్ట్రంలోని తిరువళ్లూరు జిల్లాకు చెందిన పలువురు నాన్‌బైలబుల్ వారెంట్ కేసుల్లోని ముద్దాయిలు ఇటీవల తిరుపతిలో మాకాం వేసినట్లు సమాచారం ఉందని తిరువళ్లూరు కలెక్టర్ ఎం. ప్రతాప్ ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం తిరువళ్లూరు కలెక్టర్‌తోపాటు ప లువురు ఆ జిల్లా అధికారులు, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌తోపాటు ఎస్పీ సుబ్బరాయుడు, తిరుపతి జిల్లా అధికారులు వీడియో కాన్ఫరెన్స్‌లో పలు అంశాలపై సమీక్షించారు. తిరువళ్లూరు కలెక్టర్ మాట్లాడుతూ తమ జిల్లాలో పలు కేసులు ఉన్న పలువురు వ్యక్తులు తిరుపతి జిల్లాలో నివాసం ఉంటున్న నేపథ్యంలో ఎన్నికల సమయంలో వారికి అడ్డుకట్టవేయాల్సి ఉందని, మరోవైపు వారి సమాచారం లభించిన వెంటనే చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల రోజుల్లో సరిహద్దు ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూత వేయాలని పేర్కొన్నారు. తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తప్పకుండా సరిహద్దు గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంటుందని చెప్పారు. నకిలీ ఓటర్లను గుర్తించి తొలగింపు చర్యలు తీసుకుంటామని చెప్పారు. మద్యం దుకాణాలు తప్పకుండా మూత వేస్తామని చెప్పారు. అలాగే ఎస్సీ సుబ్బరాయుడు మాట్లాడు తూ నాన్‌బైలబుల్ వారెంట్ కేసుల్లోని ముద్దా యిలు తిరుపతి జిల్లాలో నివాసం ఉంటే వారిని తప్పకుండా పట్టుకుంటామని స్పష్టం చేశారు. జిల్లా ఎకై ్సజ్ శాఖ అధికారి నాగమల్లేశ్వర్‌రెడ్డి, డీఆర్వో నరసింహులు, శ్రీకాళహస్తి ఆర్డీవో భానుప్రకాష్‌రెడ్డి జిల్లా నుంచి పాల్గొన్నారు.
తిరుపతిలో తిరువళ్లూరు ముద్దాయిలు మకాం


