● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్తులు ● సస్పెన్షన్‌ చేసినా లెక్కలేదు ● కాసులు ఇస్తేనే..దస్త్రం కదిలేది | - | Sakshi
Sakshi News home page

● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్తులు ● సస్పెన్షన్‌ చేసినా లెక్కలేదు ● కాసులు ఇస్తేనే..దస్త్రం కదిలేది

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

● ఏసీ

● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్త

● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్తులు ● సస్పెన్షన్‌ చేసినా లెక్కలేదు ● కాసులు ఇస్తేనే..దస్త్రం కదిలేది

తిరుపతి అర్బన్‌: రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలోని అధికారులకు అడిగింది ఇస్తే చాలు అంతా వాళ్లే చూసుకుంటారు.. ఇవ్వకపోతే డాక్యుమెంట్స్‌లో అన్నీ త ప్పులున్నాయంటూ రిజిస్ట్రేషన్‌ వాయిదా వేస్తారు. ఈ క్రమంలో దూర ప్రాంతాల నుంచి వచ్చిన క్రయవిక్రయదారులు మళ్లీ రాలేమంటూ వాళ్లు అడిగింది ఇచ్చి, రిజిస్ట్రేషన్‌ చేసుకుంటున్నారు. ఇలా చేసుకుంటున్న వారు 99 శాతం మంది ఉన్నారు. జిల్లాలోని 16 సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీసుల్లో ఇదే తంతు కొనసాగుతుంది. ఏసీబీ దాడులు చేసినా లెక్కచేయడం లేదు. సస్పెన్షన్‌ చేసినా భయపడడం లేదు. 20 నెలల వ్యవధిలో జిల్లాలో 10 మందికిపైగా రిజిస్ట్రేషన్‌ ఆఫీసుల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సస్పెన్షన్‌కు గురయ్యారు. అయితే దాదాపుగా అంతా మళ్లీ ఉద్యోగాల్లో చేరడం విశేషం. సస్పెన్షన్‌ అయితే ఏముంది.. ఏసీబీ వాళ్లు పట్టుకుంటే ఏమవుతుంది.. అని పలువురు అంటున్నారు. విజయవాడ స్థాయిలో ముడుపులు ముట్టజెప్పి మళ్లీ ఉద్యోగంలో చేరామని చెబుతున్నారు. అన్ని తెలిసీ చేసేదేమీ లేక జిల్లాస్థాయి అధికారులు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లకు రావాల్సిన వాటా ఇస్తే సర్దుకుపోవడమే నేర్చుకున్నారు.

ప్రైవేటు ఏజెన్సీ వాతావరణం

కొత్త వాళు్‌ల్‌ సబ్‌రిజిస్ట్రార్‌ ఆఫీస్‌కి వెళితే ప్రభుత్వ ఆఫీస్‌లా కాకుండా ఓ ప్రైవేటు ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లిన వాతావరణం కనిపిస్తుంది. ఆఫీస్‌లో పనిచేస్తున్న ఉద్యోగులు తమ సొంత కార్యాలయంలా వ్యవహరిస్తున్నారు. ప్రతి అఫీస్‌లో శాశ్వత ఉద్యోగు లు ఎంత మంది ఉన్నారో.. అందుకు రెట్టింపుగా ప్రైవేటు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇటీవల జిల్లా కలెక్టర్‌ వెంకటేశ్వర్‌ రేణిగుంట సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాన్ని తనిఖీ చేసిన క్రమంలో ప్రైవేటు వ్యక్తులను పెట్టుకోకూడదని స్పష్టంగా ఆదేశాలు జారీ చేశారు. అయినా ఆయన ఆదేశాలను అమలు చేయలేదు. జిల్లాలో రేణిగుంట, తిరుపతి, తిరుపతి రూరల్‌, శ్రీకాళహస్తి సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాలు కీలకం. అత్యధికంగా ఈ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్లు చేస్తుంటారు. ప్రతి కార్యాలయంలో రోజుకు 40 నుంచి 60 వరకు రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి. అయితే ఈ కార్యాలయాల్లోనే ప్రైవేటు సిబ్బంది ఎక్కువగా పనిచేస్తున్నారు.

రూ.50 చలానా రూ.500

మార్కెట్‌ విలువకు సంబంధించి వాల్యువేషన్‌ సర్టిఫికెట్‌కు యాజర్‌ చలాన రూ.50 కట్టాలి. గంటలో అందించాలి. అయితే మూడు రోజుల తర్వాత రూ.200 తీసుకుని ఇస్తున్నారు. అదే రోజే కావాలంటే రూ.500 లాక్కుంటున్నారు. అలాగే మ్యారేజ్‌ సర్టిఫికెట్‌కు రూ.500 చలానాను ఆన్‌లైన్‌లో చెల్లిస్తే అప్రూవల్‌ చేసి సర్టిఫికెట్‌ ఇవ్వాల్సి ఉంది. అయితే ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.1500 నుంచి రూ.2వేలు డిమాండ్‌ చేస్తున్నారు.

అవినీతిమయం

సమాజంలో అవినీతి పెచ్చుమీరుతోంది.. ప్రజలకు సేవలందించాల్సిన రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలను అవినీతి కాలుష్యం ఆవహించి, జనానికి హాని కరంగా మారింది. ప్రతి ఒక్కరికీ డబ్బులివ్వందే దస్త్రం కదలడం లేదు. అధికారాన్ని అవకాశంగా చేసుకుని ప్రతి పనికీ లంచం డిమాండ్‌ చేయడం తో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలు అవినీతి కి అడ్డాగా మారిపోయాయి. ఏసీబీ దూకుడు పెంచి దాడులు చేసినా, సస్పెన్షన్‌ గురైనా అక్రమార్కులు భయపడడం లేదు.. ఏది జరిగినా ఇటు వెళ్లి.. అటు వచ్చేస్తున్నారు. ఇదీ జిల్లాలో రిజిస్ట్రేషన్‌ కార్యాలయాల అవినీతి భాగోతం.

రేణిగుంటలో పనిచేస్తూ సస్పెన్షన్‌లో ఉన్న ఓ అటెండర్‌ ఇంట్లో ఇటీవల ఏసీబీ చేసిన తనిఖీల్లో ఏకంగా రూ.6 కోట్ల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అటెండర్‌ ఇంట్లోనే ఆ స్థాయిలో ఆస్తులు కూడగట్టారంటే...ఇక పెద్ద ఆఫీసర్లు లెక్కలు ఎంత ఉంటుందో ఊహకు అందడం లేదు.

దొంగ స్టాంపులు సృష్టిస్తున్నారనే ఉద్దేశంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఈ–స్టాంపులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్టాంపుల్లో తేదీ, టైమ్‌, ఏ పనికి అనే కారణం, పార్టీ పేరు తదితర పూర్తి వివరాలు వస్తాయి. దీంతో మోసాలకు అవకాశం ఉండదు. ఈ క్రమంలో రూ.10 నుంచి రూ.10 వేల వరకు ఈ–స్టాంపులు తీసుకునే సౌలభ్యాన్ని గత ప్రభుత్వం కల్పించింది. అయితే చంద్రబాబు పాలనలో రూ.10, రూ.20 స్టాంపులు ఇవ్వడం లేదు. రూ.100 స్టాంపులను రూ.150కి విక్రయిస్తున్నారు. ఈ స్టాంపులను ఆఫీస్‌లో విక్రయించడానికి అనుమతులు లేవు. కేవలం వెండర్లు మాత్రమే అమ్మాల్సి ఉంది. ఇదే అదునుగా వారు చెప్పేందే వేదంగా మారింది. అలాగే నాన్‌ జుడీ షియల స్టాంపులను సబ్‌రిజిస్టార్‌ ఆఫీస్‌ల్లో విక్రయిస్తున్నారు. అయితే క్రయవిక్రయదారులు రిజిస్ట్రేషన్‌ సందర్భంగా వాటిని తమ వద్దే కొనుగోలు చేయాలనే వంక పెట్టడంతో అక్కడే తీసుకుంటున్నారు. అయితే వారు రూ.100 స్టాంపును రూ.200, రూ.50 స్టాంపులను రూ.100కు విక్రయిస్తున్నారు. ఇలా ప్రతి విభాగంలోనూ ఇష్టారాజ్యంగా దోచేసుకుంటున్నారు.

డబ్బులివ్వకుంటే డాక్యుమెంట్లు కావాలి

తిరుపతి జిల్లా రిజిస్ట్రార్‌ ఆఫీస్‌లో రిజిస్ట్రేషన్‌కు వెళ్లిన వారు డబ్బులివ్వకుంటే అనవసరం డాక్యుమెంట్లు అడుగుతున్నారు. డబ్బులిస్తే అవసరం అయిన డాక్యుమెంట్లు లేకున్న రిజిస్ట్రేషన్‌ చేసేస్తున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటు ముందే చెప్పేస్తున్నారు. పలు పోస్టులు ఖాళీగా ఉండడంతో చెక్‌ స్లిప్‌, ఫొటోలు, తంబ్‌, ఐరీష్‌, డాక్యుమెంట్స్‌ స్కానింగ్‌ తదితర కీలకమైన పనులు ప్రైవేటుగా పెట్టుకున్న వ్యక్తులే చేసేస్తున్నారు. సాధారణంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి మూలపత్రాలు(ఫస్ట్‌ డాక్యుమెంట్‌) తప్పనిసరి. ఒక వేళ మూలపత్రాలు లేకుంటే సర్వే రిపో ర్ట్‌, సైట్‌ లేదా ఇంటి ఫొటో, క్రమవిక్రయదారుల ఆధార్‌కార్డు, ఫాన్‌కార్డు(పాన్‌కార్డు లేకుంటే ఫామ్‌ 60, ఫామ్‌ 61 పూర్తి చేసి ఇవ్వాలి), రూట్‌ మ్యాప్‌, ఇంటిపన్ను(ఇల్లు రిజిస్ట్రేషన్‌ అయితే) ప్లాట్‌ అయితే సమీపంలో నివాసం ఉంటున్న వారి డోర్‌ నంబర్‌ ఇవ్వాలనే రూల్స్‌ ఉన్నాయి. డబ్బులు ఇస్తే ఇవేమీ అవసరం లేదు.

● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్త1
1/3

● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్త

● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్త2
2/3

● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్త

● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్త3
3/3

● ఏసీబీ దాడులంటే భయం లేదు ● ఓ అటెండర్‌కు రూ.6కోట్ల ఆస్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement