రెడ్‌బుక్ రాజ్యాంగంతో నయా బిహార్‌గా ఏపీ
సూళ్లూరుపేట: ‘ప్రశాంతంగా ఉన్న రాష్ట్రాన్ని రెడ్‌బుక్ రాజ్యాంగం నయా బిహార్‌గా మార్చేసింది. ప్రస్తుతం బిహార్ సుభిక్షంగా వుంది కదా! మరి ఏపీని ఎందుకు అల్లకల్లోలం చేస్తున్నారు. శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వు లేదు కదా! మరి శ్రీవారికి క్షమాపణ చెప్పి ప్రా యశ్చితం చేసుకోమంటే అది బూతా.. ప్రశ్నించిన వా రి ఇళ్లపై దాడులు చేసి ఇళ్లు కాల్చేస్తారా! డైవర్షన్ పా లిటిక్స్‌లో టీడీపీ కూటమి పీహెచ్‌డీ చేసింది.’ అని వైఎస్సార్‌సీపీ సూళ్లూరుపేట నియోజకవర్గ సమన్వ క ర్త కిలివేటి సంజీవయ్య అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న దమనకాండపై సోమవారం సంజీవయ్య స్థాని క సీఐ మురళీకృష్ణకు వినతిపత్రం సమర్పించారు. కి లివేటి మాట్లాడుతూ హిందువులకు ఆరాధ్య దైవమైన వేంకటే శ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతుకొవ్వు కల్తీ చే శారని బాధ్యత కలిగిన సీఎంగా చంద్రబాబు లేని పోని ప్రచారం చేయడం సబబేనా! అని ప్రశ్నించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరో అడుగు ముందుకేసి పందికొవ్వు, ఆవుకొవ్వు కలిపారని సనాతన హైందవ ధర్మం అని లేని పోని రాద్ధాంతం చేసిన విషయం తెలిసిందేనన్నారు. వీళ్లు చేస్తున్న లేనిపోని రాద్ధాంతంపై మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించి ఈ అబద్ధపు ప్రచారాన్ని సిట్‌తో కాకుండా సీబీఐతో విచారణ చేపట్టాలని సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ అంశాన్ని సీబీఐకి అప్పగించిన విషయం తెలిసిందేనని అన్నారు. గత నాలుగైదు రోజుల ముందు లడ్డూలో జంతుకొవ్వు లేదని చెప్పినా కూటమి నేతలు ఉన్మాదంతో ఊగిపోయి, ప్రతి పట్టణంలో ఫ్లెక్సీలు వేయడం తప్పు కాదా! అని ప్రశ్నించారు. అబద్దాలు ప్రచారం చేస్తున్న కూటమి నాయకులకు మంచి బుద్ధి ప్రసాదించు స్వామీ అని మాజీ మంత్రి అంబటి రాంబాబు గుడికి వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో కూటమి నాయకులు దాడికి యత్నించిన సమయంలో మాట తూలి, చంద్రబాబును కాకుండా అక్కడున్న వ్యక్తులను దూ షించారన్నారు. దీనిపై అలా అనకుండా ఉండాలని కూ డా అంబటి బాధపడ్డారనన్నారు. అంత మాత్రాన ఇళ్లపై దాడులు చేసి విధ్వంసం సృష్టించడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇటీవల నెల్లూరులో ప్రసన్నకుమార్‌రెడ్డి, నేడు గుంటూరులో అంబటి రాంబాబు, కృష్ణా జిల్లాలో జోగి రమేష్ ఇళ్లపై దాడులు చేసి మారణకాండ సృష్టించి రాష్ట్రాన్ని రావణకాష్టం చే యడం సబబేనా బాబూ? అన్నారు. లడ్డూలో జంతుకొవ్వు లేదని సీబీఐ నిర్ధారణ చేసింది కదా! మరి మీ అందరికీ చిత్తశుద్ధి ఉంటే వేంకటేశ్వరస్వామి వద్ద సాగిల పడి, క్షమాపణలు చెప్పి భక్తులకు నమ్మకం కలిగించే ప్రయత్నాలు చేయాలని హితవు పలికారు.
డైవర్షన్ పాలిటిక్స్ కోసమే దౌర్జన్య కాండ
విశాఖపట్నం ఎంపీ, గీతం విద్యాసంస్థలు అధినేత మతకుమిల్లి భరత్‌కు సుమారు రూ.5 వేల కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అప్పనంగా అప్పగించే ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని వైఎస్సార్‌సీపీ బయటకు తీయడంతో వెంటనే డ్రైవర్షన్ పాలిటిక్స్‌కు తెరతీశారన్నారు. రెడ్‌బుక్ రాజ్యాంగం రచయిత నారా లోకేష్‌కు తోడల్లుడైన భరత్‌కు భూములను అప్పగించే ప్రయత్నాలపై తమ పార్టీ ఉద్యమాలకు సిద్ధమైన తరుణంలో ఈ డైవర్షన్ పాలిటిక్స్‌ను చేసి దాడులు, దారుణ మారణ కాండను సృష్టించి రాష్ట్రాన్ని మరో బీహార్‌లా తయారు చేశా ర న్నారు. దేశమంతా అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలు చేస్తుంటే రాష్ట్రంలో లో కేష్ రాసిన రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలను లేకుండా చేయాలని డౌర్జన్యాలు చేస్తున్నారని అన్నారు. పార్టీ పట్టణ అఽ ద్యక్షుడు వేళ్లపాళెం కృపాకర్‌రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ చిన్ని సత్యనారాయణ, కౌన్సిల్ సభ్యులు మీజూరు రామకృష్ణారెడ్డి, బందిల మహేష్, పాల్గొన్నారు.


