సంప్రదాయాల విలువలు పెంచండి
నారాయణవనం: భవిషత్తుకు దారి చూపే వృత్తి వి ద్యలతో సమానంగా కుటుంబ, దేశ సంప్రదాయాలకు విలువలు పెంచేలా యువ ఇంజినీర్లు కృషి చేయాలని అశోకరాజు అన్నారు. సిద్ధార్ధ ఇంజినీ రింగ్ కళాశాల సిల్వర్ జూబిలీ వేడుకల్లో భాగంగా బుధవారం ట్రెడిషనల్(సంప్రదాయ) డే నిర్వహించారు. చైర్మన్ నుంచి విద్యార్థులు వరకు భారతీయ సంప్రదాయ వస్త్రధారణలో కళాశాలకు వి చ్చేశారు. అధ్యాపకులకు విద్యార్థులకు తంబోల, ఫొటో కాంపిటీషన్, మిస్టర్ అండ్ మిసెస్ పోటీలను నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి షీల్డ్‌లు, బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా కళాశాలల చైర్మన్ అశోక రాజు మాట్లాడుతూ పూర్వం మన పెద్దలు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించారని తెలిపారు. ఆధునిక, పాశ్చాత్య దేశాల పోకడలతో సంప్రదాయాల విలువలు తగ్గుముఖం పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సా యంత్రం ఓపెన్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన విద్యార్థుల సాంస్కృతిక, నాటక ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు.
23 కిలోల గంజాయి స్వాధీనం
– ఐదుగురి అరెస్టు
నాయుడుపేట టౌన్: మేనకూరు కేంద్రంగా చేసు కుని గంజాయి విక్రయాలు జరిపే ఇతర రాష్ట్రాలకు చెందిన ముఠాకు సంబంధించి ఐదుగురిని బుధవారం పోలీసులు చాకచాక్యంగా పట్టుకున్నట్లు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు బుధవారం వెల్లడించారు. నాయుడుపేట అర్బన్ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం రాత్రి విలేకరుల సమావేఽశంలో డీఎస్పీ ఈ వివరాలను వెల్లడించారు. నా యుడుపేట మండలంలో మేనకూరు పరిశ్రమల కేంద్రం వద్ద గంజాయి సరఫరా జరుగుతున్నట్లు పోలీసులకు రహస్య సమాచారం అందింది. దీంతో డీఎస్పీ సారధ్యంలో నాయుడుపేట రూరల్ సీఐ సంగమేశ్వరరావు, మహిళా ఎస్‌ఐ భానుప్రసూన పోలీసులతో ప్రత్యేక నిఘా పెట్టించారు. బుధవారం పోలీసులతోపాటు తహసీల్దార్ మా గర్ల రాజేంద్రతో కలిసి మండలంలోని మేనకూరు బైపాసు రోడ్డు వద్ద ఆకస్మికంగా సోదాలు జరిపి, 11 గంజాయి ప్యాకెట్లు కలిగి ఉన్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిలో బిహర్ రా ష్ట్రానికి చెందిన ముఖేష్ గిరి, ఒడిశా రాష్ట్రానికి చెందిన సుధాకర్ దాస్, షీబా దాస్, గోపాబంధు దాస్, జార్ఖండ్‌కు చెందిన పింకిదేవిని అరెస్టు చేసి నట్టు సీఐ తెలిపారు. విచారణలో ఇతర రాష్ట్రా లకు చెందిన వీరంతా ఒడిశా నుంచి గంజాయి అక్రమంగా తెస్తు మేనకూరులో విక్రయాలు జ రుపుతున్నట్లు డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు రూ.5 లక్షలకు పైగా విలువ చేసే 23 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. సీఐ , ఎస్‌ఐని డీఎస్పీ అభినందించారు.


