సాంస్కృతిక కార్యక్రమాలపై అవగాహన ఒప్పందం
తిరుపతి రూరల్: శ్రీలంక దేశంలో స్థిరపడిన తెలుగు వారికి తెలుగు భాష, సంస్కృతిని నేర్పడానికి శ్రీ పద్మావతీ మహిళా యూనివర్సిటీలోని తెలుగు అధ్యయన శాఖ ముందుకు వచ్చింది. బోధన, అభ్యసన, అకడమిక్ సాంస్కృతికతను మరింత బలోపేతం చేయాలనే లక్ష్యంతో తెలుగు అధ్యయన శాఖ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, తెలుగు నెరవు శ్రీకాళహస్తి మధ్య గురువారం అవగాహన ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ద్వారా రెండు సంస్థలు సంయుక్తంగా బోధన, అభ్యసన కార్యక్రమాలు, సాంస్కృతిక, సాహిత్య, విద్యా కార్యక్రమాలు నెల రోజుల పాటు నిర్వహించటానికి పరస్పర సహకారం అందించుకోనున్నారు. ఈ అవగాహన ఒప్పందంతో శ్రీలంకలోని తెలుగు విద్యార్థులకు తెలుగు భాషను నేర్పడమే కాకుండావారి మూలాలను తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని నిర్వాహకులు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మహిళా వర్సిటీ వైస్‌చాన్సలర్ ఆచార్య వి.ఉమ, రిజిస్ట్రార్ ఆచార్య ఆర్. ఉష, డీన్ ఆచార్య సి.వాణి, తెలుగు శాఖాధ్యక్షులు ఆచార్య కొలకలూరి మధు జ్యోతిపాల్గొన్నారు.


