మూకుమ్మడిగా ఇద్దరిపై దాడి
దొరవారిసత్రం: రెండు వర్గాలు మధ్య చిన్నపాటి వివాదం పెద్దది కావడంతో బైక్‌పై వెళుతున్న ఇద్దరి పై పలువురు మూకుమ్మడిగా దాడికి దిగిన ఘటన గురువారం రాత్రి వేణుంబాకం రోడ్డు సమీపంలో చోటు చేసుకుంది. నాయుడుపేట సీఐ సంఘమేశ్వరావు, ఎస్‌ఐ అజయ్‌కుమార్ కథనం మేరకు.. వడ్డికండ్రిగ గ్రామానికి చెందిన వలిపి శివకుమార్, రామాంజనేయులు, అదే గ్రామానికి చెందిన విద్యాసాగర్ మధ్య పాతకక్షల దృష్ట్యా వాదోపవాదాలకు దిగి, గురువారం రాత్రి ఘర్షణ పడ్డారు. ఇరువురు స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఇది ఇలా ఉండగానే ఇరువర్గాల వారు పోలీస్ స్టేష న్ సమీపంలో వాదులాడుకుని తలపడేందుకు సిద్ధపడ్డాగా విషయం తెలుసుకున్న ఎస్‌ఐ, పోలీసులు మందలించి పంపారు. అప్పటికే ఓ వర్గానికి చెందిన విద్యాసాగర్ స్వగ్రామం నుంచే కాకుండా బ యటప్రాంతాల్లోని బంధువులు, స్నేహితులను దొ రవారిసత్రం గ్రామానికి పిలిపించాడు. స్టేషన్ వద్ద ఏమి జరుగుతుందోనని తెలుసుకునేందుకు వడ్డికండ్రిగకు చెందిన హరినాఽథ్, రమణయ్య వచ్చి తిరి గి నాయుడుపేటకు బైక్ పై వెళుతుండగా విద్యాసాగర్ వర్గానికి చెందిన పలువురు వేణుంబాకం రోడ్డు వద్ద కాపుకాసి, మూకుమ్మడి దాడికి దిగడంతో హరినాఽథ్ పరారయ్యాడు. రమణయ్య పై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. క్షతగాత్రుడిని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. దాడికి పాల్పిడిన ఏడు గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరి కొంత మంది పరారీలో ఉన్నట్లు సీఐ తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా వడ్డికండ్రిగలో పికెట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.


