దుబాయ్‌ సదస్సుకు పేటశ్రీ | - | Sakshi
Sakshi News home page

దుబాయ్‌ సదస్సుకు పేటశ్రీ

Feb 12 2026 7:04 AM | Updated on Feb 12 2026 7:04 AM

దుబాయ్‌ సదస్సుకు పేటశ్రీ

దుబాయ్‌ సదస్సుకు పేటశ్రీ

తిరుపతి కల్చరల్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ దుబాయ్‌లో ఈనెల 15,16వ తేదీల్లో ఎస్‌పీజే స్కూల్‌ ఆఫ్‌ గ్లోబల్‌ మేనేజ్‌మెంట్‌ వారు నిర్వహిస్తున్న ఇంటర్నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఆన్‌ ఇంటర్‌ డిసిప్‌లైనరీ రీసెర్చ్‌ అండ్‌ గ్లోబల్‌ డెవలప్‌మెంట్‌(ఐసీఐఆర్‌జీడీ–2026) సదస్సు జరుగనుంది. ఈ అంతర్జాతీయ సదస్సులో ఆచార్య పేట శ్రీనివాసులురెడ్డి పాల్గొని ‘ఫర్‌ఫార్మింగ్‌ ఆర్ట్స్‌ ఆఫ్‌ తిరుమల బ్రహ్మోత్సవమ్స్‌– ఏపీ, ఇండియా’ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పిస్తారు. పేటశ్రీ తిరుపతి గంగజాతర, తిరుమల, తిరుపతి కథలు, కోనేటి రాయని కథలు వంటి తిరుపతికి సంబంఽధించిన పుస్తకాలను ప్రచురించారు. ఈయన గతంలో ఆస్ట్రేలియా, చైనా, ఇండోనేషియా, వియత్నం, శ్రీలంక, భూటాన్‌, థాయ్‌ల్యాండ్‌ వంటి దేశాల్లోని సదస్సుల్లో పాల్గొని పరిశోధన పత్రాలను సమ ర్పించారు.

సెక్టోరియల్‌ ఇంటర్వ్యూలు

తిరుపతి అర్బన్‌: సమగ్రశిక్ష విభాగంలో ఖాళీగా ఉన్న ఐదు సెక్టోరియల్‌ పోస్టులకు బుధవారం కలెక్టరేట్‌లో ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించారు. జిల్లాకు సంబంధించి 39 మంది ఉపాధ్యాయులు దరఖాస్తులు చేసుకున్నప్పటికీ 31 మంది మాత్రమే హాజరయ్యారు. డీఆర్వో నరసింహాలుతోపాటు డీఈఓ కేవీఎన్‌ కుమార్‌, సమగ్రశిక్ష అధికారి గౌరీశంకర్‌, డైట్‌ ప్రిన్సిపల్‌ శ్యామలాదేవి నేతృత్వంలో ఇంటర్వ్యూలు జరిపారు. మెరిట్‌ ప్రకారం రెండు మూడు రోజుల్లో ఫలితాలు వెల్లడించనున్నామని సమగ్రశిక్ష జిల్లా అధికారి గౌరీశంకర్‌ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement