రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Feb 11 2026 8:49 AM | Updated on Feb 11 2026 8:49 AM

రోడ్డ

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

తిరుపతి రూరల్‌: తిరు పతి నుంచి ఉప్పరపల్లి మీదుగా జాతీయ రహదారికి వెళ్లే మార్గంలో ద్విచక్ర వాహనాన్ని ఓ కారు వెనుక నుంచి ఢీకొంది. దీంతో ద్విచక్రవాహనంపై ప్రయాణించే ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలైన సంఘటన చేసుకుంది. తిరుపతి రూరల్‌ పోలీసుల కథనం మేరకు.. తిరుపతి రూరల్‌ మండలం ఉప్పరపల్లికి చెందిన చంద్రబాబు కుమారుడు విక్రమ్‌ (19)కు చిన్నతనంలోనే తన తల్లి చనిపోవడంతో తన అక్క గీతాంజలితో కలసి తండ్రితో కలిసి ఉంటున్నారు. ఇంటర్‌ వరకు చదువుకున్న విక్రమ్‌ ఆ తరువాత చదువు ఆపేసి బతుకు దెరువుకు కూరగాయల వ్యాపారం సాగిస్తున్నాడు. తన స్నేహితుడు రాజ్‌కుమార్‌తో కలసి సోమవారం రాత్రి ఉప్పరపల్లి నుంచి తిరుపతిలోకి తన ద్విచక్రవాహనంపై వెళుతుండగా రామానుజపల్లి జంక్షన్‌ నుంచి తిరుపతి నగరంలోకి వెళ్లే మారుతీ కారు అతివేగంగా వచ్చి వెనుక నుంచి ఢీ కొంది. ఈ ఘటనలో ద్విచక్రవాహనంపై వెళ్లే ఇద్దరికీ బలమైన గాయాలుకాగా అదే సమయంలో అటుగా వచ్చి న విక్రమ్‌ సమీప బంధువులు క్షతగాత్రులను తిరుపతి రుయాకు తరలించారు. చికిత్స పొందుతున్న విక్రమ్‌ అర్ధరాత్రి మృతి చెందాడు. మృతుని అక్క గీతాంజలి ఫిర్యాదు మేరకు తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

వ్యక్తి అరెస్టు

పుల్లంపేట: హెడ్‌కానిస్టేబుల్‌ను గాయపరిచిన వ్యక్తిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా నిందితునికి నందలూరు జడ్జి రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు. ఎస్‌ఐ కథనం మేరకు.. మండలంలోని కోనయ్యగారిపల్లెకు చెందిన చలమల మల్లికార్జునరెడ్డి ఆదివారం రాత్రి పుల్లంపేటలోని తన మేనత్త భర్త నాగా తిమ్మారెడ్డి ఇంటికి వెళ్లి డబ్బుల కోసం డిమాండ్‌ చేయగా లేదని తెలపడంతో గొడవపడ్డాడు. దీంతో తిమ్మారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణకు వచ్చిన హెడ్‌కానిస్టేబుల్‌ సుబ్బరాజును ఉంగరపు వేలు, మధ్య వేలును కొరికి గాయపరచడంతో కేసు నమోదు చేసి, అరెస్టు చేశామన్నారు. కాగా మంగళవారం నందలూరు కోర్టులో హాజరు పరచగా జడ్జి 14 రోజులు రిమాండ్‌ విధిస్తూ తీర్పునివ్వడంతో రాజంపేట జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు.

గుర్తుతెలియని వ్యక్తి మృతి

రేణిగుంట: పట్టణంలోని ఓల్డ్‌ చెక్‌ పోస్ట్‌ సమీపంలో ఉన్న రైల్వే ట్రాక్‌ పక్కన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ఉన్నట్లు మంగళవారం ఉదయం స్థానికులు రేణిగుంట అర్బన్‌ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసుల కథనం మేరకు.. రైల్వేట్రాక్‌ పక్కన 50 నుంచి 55 ఏళ్ల గుర్తు తెలియని పురుషుడు మృతి చెందాడు. అతని శరీరంపై ఎటువంటి గాయాలు లేకపోవడంతో అనారోగ్య కారణం గానీ, లేదా ఫిట్స్‌ రావడంతో గానీ మృతి చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. మృతుడు పసుపు రంగు షర్టు, తెలుపు రంగు పంచె ధరించి ఉండగా, అతని చర్మ తెలుపు రంగులో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వివరాలు తెలిస్తే వెంటనే రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌ వారిని సంప్రదించి సమాచారం అందించాలని కోరారు.

పక్కా గృహాల అప్పగింతకు చర్యలు

నాయుడుపేట టౌన్‌: తిరుపతి జిల్లాలో 18,943 పైగా వివిధ దశలో నిర్మాణంలో ఉన్న పక్కా గృహాలను లబ్ధిదారులకు ఉగాది నాటికి అందించేలా ప్రభుత్వం చర్యలు చేపడుతుందని గృహ నిర్మాణ శాఖ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అరుణ్‌ బాబు తెలిపారు. పట్టణంలోని బిరదవాడ సమీపంలో నిర్మిస్తున్న పక్కాగృహాలను మంగళవారం ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. అక్కడ గృహాల నిర్మాణ పనులను గుర్తించి అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ జిల్లా అధికారి అన్నం శ్రీనివాసరావు, సూళ్లూరుపేట డీఈ దశయ్య, ఏఈ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి 
1
1/3

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి 
2
2/3

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి 
3
3/3

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement