స్పెల్–2 ప్రాక్టికల్స్‌కు 143 మంది గైర్హాజరు
తిరుపతి సిటీ: జిల్లా వ్యాప్తంగా ఇంటర్ స్పె ల్–2 ప్రాక్టికల్స్‌లో భాగంగా తొలిరోజు శుక్రవారం జరిగిన పరీక్షలకు 143 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ఆర్‌ఐఓ రాజశేఖర్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ప్రాక్టి కల్స్ పరీక్షకు 3,785 మందికి గాను 3,697 మంది విద్యార్థులు హాజరుకాగా మధ్యాహ్నం జరిగిన ప్రయోగ పరీక్షకు 3,080 మందికి గాను 3,025మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు ఈనెల 10వ తేదీవరకు జరగనున్నాయన్నారు.
హోమ్ లోన్ మేళా నేడు, రేపు
తిరుపతిఎడ్యుకేషన్ : కెనరా బ్యాంకు ఆధ్వర్యంలో 7, 8వ తేదీల్లో హోమ్ లోన్ మేళా నిర్వహించనున్నట్లు ఆ బ్యాంకు జీఎం పాండురంగ మితాయ ఓ ప్రకటనలో తెలిపారు. కరకంబాడీ రోడ్డులోని గెస్ట్‌లైన్ డేస్ హోటల్ సమీపంలోని ఏబీ ఆవాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫొనెక్స్ టవర్ ప్రాంగణంలో రెండు రోజుల పాటు హోమ్ లో న్ మేళాను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేళాలో వినియోగదారులకు తక్షణమే లోన్ అప్రూవల్, తక్కువ వడ్డీ రేటు, ప్రత్యేక ఆఫర్లను అందించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 70134 10562 నంబరులో సంప్రదించాలని ఆయన కోరారు.
బాలాజీ ఆరోగ్య వరప్రసాదినికి రూ.10లక్షల విరాళం
తిరుపతితుడా: స్వి మ్స్ బాలాజీ ఆరో గ్య వరప్రసాదిని ప థకానికి బెంగళూరు కు చెందిన నారాయ ణ సిల్క్స్ అధినేత నమ్రత ఆర్ దేవత తండ్రి డీఎస్ రాఘవేంద్ర కోరిక మేరకు రూ. 10,00,116 విరాళం అందజేశారు. ఈ మేరకు డైరెక్టర్ డాక్టర్ ఆర్వీ కు మార్‌ను ఆయన చాంబర్‌లో దాత తరఫున తి రుపతికి చెందిన వై రాఘవేంద్ర శుక్రవారం క లసి అందుకు సంబంధించి పత్రాలను, చెక్కు ను అందజేశారు. పేద రోగులకు అందిస్తున్న వైద్య సేవలను పరిగణలోనికి తీసుకుని విరాళం అందజేసినట్టు దాతలు తెలిపారు.


