కృష్ణాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

కృష్ణాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

Feb 3 2026 8:00 AM | Updated on Feb 3 2026 8:00 AM

కృష్ణ

కృష్ణాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

– ఇద్దరి మృతి

నాగలాపురం: ద్విచక్రవాహనంలో వెళుతూ చింత చెట్టును ఢీకొనడంతో ఇద్దరు యు వకులు మృతి చెందిన ఘటన మండలంలోని కృష్ణాపురంలో సోమవారం వేకువ జామున చోటు చేసుకుంది. ఎస్‌ఐ సునీల్‌ కథనం మేరకు.. నిండ్ర హరిజనవాడకు చెందిన నాగరాజు(23), రామగిరి గ్రామానికి చెందిన సంజయ్‌ (23) ద్విచక్రవాహనంలో నాగలాపురంలోని టీఆర్‌ఆర్‌ కళ్యాణ మండపానికి ఆదివారం సాయంత్రం వివాహానికి బయలుదేరారు. పెళ్లి చూసుకుని రాత్రి మండపంలో తన స్నేహితులతో ఉండి సోమవారం వేకువ జామున నాగరాజు, సంజయ్‌ తిరిగి ఇంటికి బయలు దేరారు. మార్గం మధ్యలో కృష్ణాపురం సమీపంలో మలుపు వద్ద రోడ్డు ప్రక్కన ఉన్న చింత చెట్టును ఢీకొన్నారు. దీంతో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను సత్యవేడు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కృష్ణాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం1
1/1

కృష్ణాపురంలో ఘోర రోడ్డు ప్రమాదం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement