నారాసుర ఆధరహో!
చిత్తూరు అర్బన్: తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో మ ద్యం ధరల నియంత్రణ గాలికొదిలేశారు. అమ్ము కున్నోడికి అమ్ముకున్నంతగా పట్టించుకోవడం మానేశారు. ఇదే అదునుగా వ్యాపారులు మద్యం ధరలను పెంచేశారు. ఇష్టానుసారంగా ధరలు వసూలు చేస్తూ మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు.
కోట్లు లూఠీ
‘వడ్డించేవాడు మనోడైతే చాలు..’ అన్నట్లు మద్యం దుకాణాలు దక్కించుకున్న వ్యాపారులకు ఏడాదిన్నరగా పెద్దగా లాభాలు రావడంలేదని భావించిన ప్రభుత్వం.. క్వార్టర్ బాటిల్‌పై రూ.10 పెంచుకో వడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలా చెప్పిందో లే దో.. జీవో రాకపోయినా పర్లేదు అన్నట్లు, వ్యాపారులు జిల్లాలో ధరలు పెంచేశారు. జీవో ఇవ్వడానికి నాలుగు రోజుల సమయం పట్టగా.. అప్పటికే దాదాపు రూ.5 కోట్లు కొల్లగొట్టేశారు. ఇక అప్పటి నుంచి రెండు జిల్లా ల్లో మద్యం ధరలపై నియంత్రణ పట్టుతప్పింది. ఒక దుకాణంలో దొరికే ధర, మరో దుకాణంలో ఇవ్వడం లేదు. ఎవరి ఇష్టం వచ్చినట్లు వాళ్లు అమ్ముకుంటున్నారు. ఫలితంగా రెండు జిల్లాల్లో మద్యం ప్రియుల నుంచి రోజుకు దాదాపు రూ.40 లక్షల వరకు దోచు కుంటున్నారు. ఇందులో అధికారులకు, ప్రజా ప్రతినిధులకు వాటాల్లేవంటే నమ్మశక్యం కావడం లేదు.
తిమ్మిని బమ్మి చేస్తూ..
పెంచిన మద్యం ధరలపై ఎవరైనా ప్రశ్నిస్తే వ్యాపారులు ఇచ్చే సమాధానంతోనే మద్యం ప్రియులకు సగం కిక్కు దిగిపోయేలా ఉంటుంది. తొలుత ధరల పెంపు జీవో రాకమునుపే.. ప్రభుత్వం ధరలు పెంచింది అని బోర్డు పెట్టి అదనంగా దండుకున్నారు. ఆపై జీఓ అమల్లోకి వచ్చాక.. తీరా బాటిళ్లపై పాత ధరలు ఉన్న వాటిని కొట్టేసి, కొత్త ధరలు ప్రింట్ చేసి పాత ధరను చెరిపేసి.. పెరిగిన ధరను ముద్రించారు. పె రిగిన ధర ముద్రించిన తర్వాత కూడా బాటిళ్లపై ఉన్న ధర కాదని అదనపు నగదు వసూలు చే శారు. ఇదేమని ప్రశ్నిస్తే ప్రభుత్వం ధరలు పెంచింనే బోర్డు చూపిస్తున్నారు. ధరలు పెరిగాయంటూ అదనపు నగదు వసూలు చేస్తూ రోజుకు రూ.లక్షలు దోచుకుంటున్నారు.
విచ్చలవిడిగా ‘బెల్టు’
రెండు జిల్లాల్లో బెల్టు దుకాణాలు విచ్చలవిగా వెలుస్తున్నాయి. ఇప్పటికే రెండు జిల్లాల్లో దాదాపు 4 వేలకు పైగా బెల్టు దుకాణాలున్నట్టు సమాచారం. చిల్లర కొ ట్టు నుంచి కిరాణా దుకాణం వరకు ప్రతి చోటా మ ద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ఎమ్మార్పీ కంటే రూ.20–రూ.50 అధిక ధరలకు బెల్టు దుకాణాల్లో మద్యం అమ్మేస్తున్నారు. వీటిల్లో లభిస్తున్న మద్యం ఏ బ్రాండు..? ఏ దుకాణం నుంచి వచ్చింది..? అసలు కల్తీనా..? అనే ప్రశ్నలకు ఎవ్వరి వద్దా సమాధానాలు దొరకడం లేదు. మద్యం కల్తీ కాకపోతే వాటిపై ఉన్న క్యూఆర్ ఆధారంగా అవి ఏ దుకాణానికి చెందినవో ఎక్సైజ్ అధికారులు గుర్తించి, రూ.లక్షల్లో జరిమానాలు విధించాలి. కానీ జిల్లాల్లో అలా జరగడం లేదు.
తిరుపతి జిల్లాలో మద్యం దుకాణాలు, బార్లు
మద్యం దుకాణాలు – 225
మద్యం బార్లు – 27
రోజుకు వ్యాపారం (సగటు) – రూ. 2 కోట్లు
పెరిగిన ధరలతో భారం – రూ.32 లక్షలు


