పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక | - | Sakshi
Sakshi News home page

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

Feb 7 2026 3:06 PM | Updated on Feb 7 2026 3:06 PM

పీఎస్

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

పుత్తూరు : మోడల్‌ ప్రైమరీ స్కూల్‌ హెడ్‌ మాస్టర్స్‌ (పీఎస్‌హెచ్‌ఎం) ఫోరం తిరుపతి జిల్లా కార్యవర్గాన్ని శుక్రవారం పుత్తూరులో ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రం ఫోరం కార్యదర్శి శ్రీనివాసులు, అసోసియేట్‌ ఉపాధ్యక్షుడు రమణ మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం త్వరలో సమగ్ర ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. ఏప్రిల్‌లో చేపట్టనున్న బదిలీల్లో పీఎస్‌హెచ్‌ఎంలకు తొలి ప్రాధాన్యత ఇచ్చి స్కూల్‌ అసిస్టెంట్స్‌గా నియమించాలని డిమాండ్‌ చేశారు. జనవరి 13న ప్రభుత్వం ఇచ్చిన మెమోను అందరికీ ఆమోదయోగ్యంగా సవరించాలని కోరారు. లేనిపక్షంలో ఉద్యమ బాట పడతామని హెచ్చరించారు. అనంతరం జిల్లా ఫోరం నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. జిల్లా గౌరవ అధ్యక్షుడిగా కె.గోపి (ఏర్పేడు), అధ్యక్షుడిగా వి.వెంకటరమణ (నాగలాపురం), ప్రధాన కార్యదర్శిగా ఎస్‌.మధుసూదన్‌రాజు (తిరుపతి రూరల్‌), కోశాధికారిగా కె.నరేష్‌ (వడమాలపేట), మహిళా అధ్యక్షురాలుగా డి.గీర్వాణి (తిరుపతి రూరల్‌), అసోసియేట్‌ అధ్యక్షులుగా, కార్యనిర్వాహక సభ్యులుగా మరి కొందరిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

శ్రీవారి దర్శనానికి 18 గంటలు

తిరుమల: తిరుమలలో శుక్రవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లోని 21 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. గురువారం అర్ధరాత్రి వరకు 61,655 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 21,003 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.3.89 కోట్లు సమర్పించారు. టైంస్లాట్‌ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడానికి 18 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 3 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.

తిరుపతిలో రోడ్డు ప్రమాదం

ఇంటర్‌ విద్యార్థి మృతి

తిరుపతి క్రైం: నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇంటర్మీడియట్‌ విద్యార్థి మృతి చెందాడు. అన్నమయ్య జిల్లా కేవీ పల్లి మండలం మూల వడ్డేపల్లి గ్రామానికి చెందిన ఎల్లయ్య కుమారుడు బాబు (17) ఉద్యోగం కోసం తిరుపతికి వచ్చి పీజీ హాస్టల్‌లో ఉంటున్నాడు. శుక్రవారం ఉదయం సుమారు 11.45 గంటల సమయంలో స్నేహితుడు హరికృష్ణతో కలిసి స్కూటీపై ఏఐఆర్‌ బైపాస్‌ రోడ్డులోని డీమార్ట్‌ పక్కన ఉన్న సందు దారి నుంచి ప్రధాన రోడ్డులోకి వస్తుండగా, టీవీఎస్‌ సర్కిల్‌ వైపు నుంచి అన్నమయ్య సర్కిల్‌ దిశగా అతివేగంగా వచ్చిన బైక్‌ స్కూటీని ఢీకొంది. ఈ ప్రమాదంలో బాబు రోడ్డుపై పడిపోవడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతడిని వెంటనే రుయా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మధ్యాహ్నం 2.12 గంటలకు మృతి చెందాడు. మృతుడి అన్న పల్లపు రమణ కుమారుడు పల్లపు రాజశేఖర్‌ ఫిర్యాదు మేరకు ఈస్ట్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కరెంట్‌ షాక్‌తో వ్యక్తి మృతి

వెంకటగిరి రూరల్‌: కరెంట్‌షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన పట్టణంలోని కాంపాళెంలో చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. కాంపాళేనికి చెందిన ఈగ రమణయ్య (52) గురువారం గొడ్డేరువాగు సమీపంలో కట్టెలు కొట్టడానికి వెళ్లారు. ఆ సమయంలో అక్కడ ఉన్న విద్యుత్‌ వైర్లు ప్రమాదవశాత్తు రమణయ్యకు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. రమణయ్య మృతి చెందడంతో కాంపాళెం ప్రాంతంలోవిషాదఛాయలు అలుముకున్నాయి.

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక 1
1/4

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక 2
2/4

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక 3
3/4

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక 4
4/4

పీఎస్‌హెచ్‌ఎం జిల్లా కార్యవర్గం ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement